ETV Bharat / sports

కష్టాల కడలిని దాటి.. పతకం గెలిచి

మీరాబాయి చాను.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. టోక్యో ఒలింపిక్స్​లో వెండి గెలుచుకున్న ఈ మణిపురి వెయిట్​లిఫ్టర్(Tokyo olympics Meerabai chanu)​.. విశ్వక్రీడల్లో భారత పతకాల పట్టికను తెరిచింది. గత రియో ఒలింపిక్స్​లో కనీస ప్రదర్శన ఇవ్వలేక చతికిలపడిన మీరా.. ప్రస్తుతం ఈ ఘనత సాధించడం వల్ల కోట్లాదిమంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే దీని వెనక మీరా అసాధారణ కృషి దాగి ఉంది. దాని గురించే ఈ కథనం..

meera
మీరాబాయ్​
author img

By

Published : Jul 25, 2021, 8:41 AM IST

2016 రియో ఒలింపిక్స్‌. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో పోటీ ముగిసింది. క్రీడాకారుల ప్రదర్శన వివరాలు బోర్డుపై ప్రత్యక్షమయ్యాయి. అందులో ఎవరెవరు ఎంత బరువు మోశారు.. ఏయే స్థానాల్లో ఉన్నారో కనిపిస్తోంది. మీరాబాయి చాను అనే పేరు ముందు మాత్రం బరువుల వివరాల్లేవు. పైన పేర్కొన్నట్లుగా 'డీఎన్‌ఎఫ్‌' అని మాత్రమే ఉంది. దీనికి అర్థం 'డిడ్‌ నాట్‌ ఫినిష్‌' అని. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మూడు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా తాను నిర్దేశించుకున్న బరువును మోయలేకపోయింది చాను(Tokyo olympics Meerabai chanu). ఏళ్లకు ఏళ్లు కష్టపడి, పతకం గెలుస్తుందన్న అంచనాలతో రియోలో అడుగు పెట్టి.. కనీసం పోటీలోనే లేకుండా పోవడమంటే అంతకంటే చేదు అనుభవం ఇంకేముంటుంది?

నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె అక్కడి నుంచి నిష్క్రమిస్తుంటే.. ఆ పోటీ చూస్తున్న కోట్లాదిమంది నుంచి నిట్టూర్పులు, తిట్లు!

అయిదేళ్ల తర్వాత ఇప్పుడు అదే ఒలింపిక్‌ వేదిక మీద ఆమె ముఖంలో నవ్వులు విరబూస్తుంటే.. కోట్లమంది నుంచి కేరింతలు, ప్రశంసలు!

"ఓటమి విజయానికి సోపానం".. ఈ నానుడికి అసలైన అర్థం చెబుతూ.. రియో పరాభవం నుంచి టోక్యో పతకం వరకు సాగిన మీరా ప్రయాణం గొప్ప స్ఫూర్తి గాథ!

meera
మీరాబాయ్​

ఫీనిక్స్‌ పక్షి శిథిలాల నుంచి లేచి పునరుజ్జీవం పొందుతుందట! లిఫ్టర్‌గా 2016 ఒలింపిక్స్‌లో శిథిల స్థితినే ఎదుర్కొన్న మీరా.. అక్కడి నుంచి పుంజుకున్న తీరు అసాధారణం. చక్కటి ఫామ్‌తో రియోలో అడుగు పెట్టిన ఆమె.. ఒలింపిక్స్‌ ఒత్తిడికి చిత్తయిపోయింది. దీంతో స్టేడియంలో మొదలైన ఆమె కన్నీళ్లు తన గదికి చేరుకున్నాక కూడా ఆగలేదు. అయితే ఆ బాధలో ఆమె కుంగిపోలేదు. తన వైఫల్యాలు గుర్తించి వాటిని దిద్దుకోవడంపై శ్రద్ధ పెట్టింది. శారీరకంగా కష్టపడితే సరిపోదని, మానసికంగా కూడా దృఢంగా మారాలని అర్థం చేసుకుంది. మొబైల్‌తో సహా తన ఏకాగ్రతకు భంగం కలిగించే అన్నింటినీ పక్కన పెట్టేసింది. కసరత్తులు పెంచింది. బలమైన పౌష్ఠికాహారంతో దృఢంగా తయారైంది. ఆటలోనూ టెక్నిక్స్‌ మెరుగుపరుచుకుంది. పెద్ద ఈవెంట్లలో ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తగ్గ మానసిక శిక్షణ పొందింది. ఏడాది తిరిగేసరికి తన విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ కావడమే కాదు.. రియోలో ఏ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో అయితే ఒక్కసారి కూడా బరువు మోయలేకపోయిందో, అదే విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది మీరా.

40 లక్షలు.. 50 రోజులు

మీరాబాయి టోక్యోకు బయల్దేరింది భారత్‌ నుంచి కాదు. గత రెండు నెలలుగా ఆమె అసలు మన దేశంలోనే లేదు. 50 రోజుల పాటు అమెరికాలో గడిపింది చాను. ఆమె పతకం గెలవడంలో ఈ పర్యటన ఓ ముఖ్య కారణం. 'టాప్‌'లో భాగమైన మీరాకు ప్రభుత్వం ఒలింపిక్స్‌ ముంగిట అమెరికాలో శిక్షణ పొందేందుకు రూ.40 లక్షల నిధులు విడుదల చేసింది. సరైన సమయంలో అందిన ఆర్థిక సాయంతో తన కోచ్‌, సహాయ బృందాన్ని తీసుకుని అమెరికాకు వెళ్లింది మీరా. స్త్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా మారిన అమెరికా మాజీ లిఫ్టర్‌ ఆరోన్‌ హార్షింగ్‌ దగ్గర శిక్షణ పొందింది. గత ఏడాది మీరా గాయం నుంచి కోలుకోవడంలో, ప్రదర్శన మెరుగుపరుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్షింగ్‌.. ఒలింపిక్స్‌ ముంగిట ఆమెను బాగా సన్నద్ధం చేశాడు. భుజం ఇబ్బందిని తప్పించుకోవడం సహా తనకు పట్టు లేని స్నాచ్‌లో కొత్త టెక్నిక్‌లు నేర్చుకుని వాటిని టోక్యోలో అమల్లో పెట్టి రజతం పట్టేసింది మీరా.

meera
మీరాబాయ్​

కట్టెల మోతతో మొదలై..

ఒలింపిక్స్‌ లాంటి అత్యున్నత వేదిక మీద విజయం అంత ఆషామాషీ కాదు. డబ్బు, సౌకర్యాలు, పలుకుబడి, ప్రోత్సాహం.. అన్నీ ఉన్నా కూడా అక్కడ పతకం సాధించడం తేలిక కాదు. అయితే మీరా ఇవేవీ లేకుండానే ఇక్కడిదాకా వచ్చింది. తన పేరు, రూపం చూస్తేనే.. దేశంలో బాగా వెనుకబడ్డ ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయనే విషయం అర్థమైపోతుంది. మణిపుర్‌లోని ఓ పల్లెటూరిలో ఓ పేద కుటుంబంలో పుట్టింది మీరా. వెయిట్‌లిఫ్టింగ్‌లోకి ఆమె ప్రయాణం కట్టెలు మోయడంతో మొదలుకావడం విశేషం. వంట చెరుకు కోసం రోజూ ఆమె తల్లితో కలిసి అడవికి వెళ్లేది. రోజూ కట్టెలు మోయడం ద్వారా చిన్నతనంలోనే తనకు 'మోత' అలవాటైపోయింది. అయితే ఆమెకు ఈ క్రీడపై ఆసక్తి కలిగేలా చేసింది మాత్రం కుంజురాణి దేవినే. తన రాష్ట్రానికే చెందిన ఈ లిఫ్టర్‌ జాతీయ రికార్డు నెలకొల్పడమే కాక.. ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడటం చూసి పదేళ్ల వయసులో ఈ ఆటపై మక్కువ పెంచుకుంది మీరా. అయితే ఎక్కడ శిక్షణ తీసుకోవాలి, ఎవరు మెలకువలు నేర్పిస్తారో తెలియదు. తన గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో కోచ్‌ అనితా చాను లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తోందని తెలుసుకుని ఆమెను కలిసింది. రోజూ అంత దూరం వెళ్లి తన దగ్గర శిక్షణ పొందేది. సరైన వెయిట్‌లిఫ్టింగ్‌ పరికరాలు కూడా లేని స్థితిలో వెదురు బొంగులకు ఇటు, అటు బరువులు కట్టి వాటితోనే సాధన చేయించేది అనిత. తక్కువ సమయంలో ప్రతిభ చాటుకుని, స్పాన్సర్ల దృష్టిని ఆకర్షించిన మీరా.. వారి ప్రోత్సాహంతో ఆధునిక శిక్షణకు తోడు మంచి పౌష్ఠికాహారం కూడా అందుకుంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ లిఫ్టర్‌ అయింది. తాను వెయిట్‌లిఫ్టింగ్‌లోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన కుంజురాణి పేరిట ఉన్న జాతీయ రికార్డును తనే 2016లో బద్దలు కొట్టడం విశేషం. తర్వాతి ఏడాదే ఆమె ప్రపంచ రికార్డునూ నెలకొల్పి సంచలనం సృష్టించింది.

meera
మీరాబాయ్​

కలిసొచ్చిన కరోనా

కరోనాను అందరూ తిట్టుకునేవాళ్లే కానీ.. మీరాకు మాత్రం మహమ్మారి కలిసొచ్చింది. గత ఏడాది ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారం జరిగి ఉంటే ఆమె పతకం గెలిచేది కాదేమో! అప్పటికి ఆమె ఫిట్‌నెస్‌ అత్యుత్తమ స్థాయిలో లేదు. 2019 ఆమె వెన్ను, భుజం గాయాలతో ఇబ్బంది పడింది. ఆ ప్రభావం తర్వాతి ఏడాదీ కొనసాగింది. కొన్ని నెలల పాటు బరువులెత్తలేదు. కరోనా కారణంగా ఒలింపిక్స్‌తో పాటు పోటీలన్నీ రద్దవడం వల్ల నెమ్మదిగా గాయాల నుంచి కోలుకుంది. కరోనా వల్ల మీరాకు జరిగిన మరో మేలు.. ఉత్తర కొరియా ఒలింపిక్స్‌ నుంచి తప్పుకోవడం. గట్టి పోటీదారైన ఆ దేశ లిఫ్టర్‌ దూరం కావడం.. చానుకు పతక రేసులో ఓ అడ్డంకి తొలగిపోయింది.

అమ్మ ఇచ్చిన కమ్మలతో

వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం అందుకున్న మీరాబాయిని చూసి దేశం సంతోషంలో మునిగిపోయింది. కానీ అదే సమయంలో ఆమె ధరించిన చెవి కమ్మలు చూసి మీరా తల్లి లీమా కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అయిదేళ్ల క్రితం తన దగ్గరున్న బంగారంతో పాటు దాచుకున్న డబ్బును ఖర్చుచేసి ఒలింపిక్స్‌ రింగులను పోలినట్లుగా మీరా కోసం ఆ కమ్మలు చేయించి ఇచ్చింది. అవి ఆమెకు అదృష్టాన్ని తెస్తాయని లీమా నమ్మకం. కానీ 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైన మీరా.. ఈ సారి అదే కమ్మలతో బరిలో దిగి రజతాన్ని సొంతం చేసుకుంది. దీంతో లీమా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. "మీరా ధరించిన చెవి దుద్దులు టీవీలో చూశా. 2016లో రియో ఒలింపిక్స్‌కు ముందు మీరాకు వాటిని ఇచ్చా. నా దగ్గరున్న బంగారు ముక్కలు, నేను దాచుకున్న డబ్బుతో వాటిని చేయించా. అవి మీరాకు అదృష్టాన్ని, విజయాన్ని అందిస్తాయని నమ్మా. ఇప్పుడు వాటిని చూడగానే కన్నీళ్లు ఆగలేదు. మీరా పతకం గెలవగానే నాతో పాటు ఆమె నాన్న ఆనంద భాష్పాల్లో మునిగిపోయాం. ఈ క్రీడల్లో స్వర్ణం లేదా ఏదో పతకం గెలుస్తానని తను మాకు ముందే చెప్పింది. అని నిజం కావాలని ఎదురుచూశాం. మాకు దగ్గర్లో ఉండే చుట్టాలు రాత్రే మా ఇంటికి వచ్చారు. ఉదయం చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. దీంతో టీవీని ఇంటి బయట వరండాలో పెట్టి మీరా ప్రదర్శన చూశాం. పతకం గెలవగానే అందరూ సంబరాల్లో మునిగిపోయారు" అని లీమా తెలిపింది. పోటీలకు ముందు టోక్యోలోని వెయిట్‌లిఫ్టింగ్‌ వేదిక నుంచి వీడియో కాల్‌ చేసిన మీరా.. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది.

meera
అమ్మ ఇచ్చిన కమ్మలతో

అయిదేళ్లలో 5రోజులే ఇంట్లో ఉన్నా.. ఒలింపిక్‌ పతకం కోసం ఎన్నో త్యాగాలు

టోక్యో ఒలింపిక్స్‌లో తన రజత పతక విజయం తర్వాత దేశంలో కొందరైనా అమ్మాయిలు క్రీడారంగంలో అడుగు పెడతారని మీరాబాయ్‌ చాను ఆశాభావం వ్యక్తంజేసింది. అమ్మాయిలు తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చాను తెలిపింది. ఒలింపిక్స్‌ పతకం కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పింది. టోక్యోలో పతకం సాధించిన తర్వాత చాను ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలివీ..

ఒలింపిక్స్‌ పతకానంతరం చేయబోతున్న మొదటి పని ?

పిజ్జా తినడం. పిజ్జా తిని చాలా ఏళ్లయింది. ఈరోజు కోసం చాలా కష్టపడ్డా. ఎంతగానో ఎదురుచూశా. ఇప్పుడు పిజ్జాకు సమయం వచ్చింది.

ఒలింపిక్స్‌ పతకం కోసం ఎలాంటి త్యాగాలు చేశారు?

ఎన్నో త్యాగాలు చేశా. గత అయిదేళ్లలో కేవలం 5 రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నా. నచ్చిన ఆహారం తినలేకపోయా. కుటుంబ సభ్యుల్ని కలవలేకపోయా. పూర్తిగా శిక్షణపైనే దృష్టిసారించా. వేరే విషయాల గురించి అస్సలు ఆలోచించలేదు. ఈ పతకం కోసమే అదంతా.

పతకం గెలిచిన తర్వాత అమ్మతో మాట్లాడారా?

రెండు నిమిషాలు అమ్మతో మాట్లాడా. పొద్దుట్నుంచి ఇంట్లో ఎవరూ ఏమీ తినలేదు. నా ఈవెంట్‌ పూర్తయ్యే వరకు తినకూడదని అనుకున్నారు. పతకం సాధించగానే అందరూ సంబరాలు చేసుకున్నారు. ఊళ్లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఇంటికి వెళ్లిగానే అమ్మ చేతి వంట తింటా. అందరినీ కలుస్తా.

రియోలో వైఫల్యం మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది?

2016 రియో ఒలింపిక్స్‌లో చాలా ప్రయత్నించా. ఎంతో కష్టపడ్డా. కాని ఆ రోజు నాది కాదు. నేనేంటో టోక్యోలో నిరూపించుకుంటానని ఆరోజే అనుకున్నా. రియోలో విఫలమైన రోజు చాలా విషయాలు నేర్చుకున్నా. శిక్షణ, టెక్నిక్‌లో ఎన్నో మార్పులు చేసుకున్నా. ఇందుకోసం ఎంతగానో కష్టపడ్డాం. రియో తర్వాత మానసికంగానూ కుంగిపోయా. చాలా బాధపడ్డా. నాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యా. చాలారోజుల వరకు నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత కోచ్‌, సమాఖ్య నాకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. నాలో ప్రతిభకు కొదవలేదంటూ ఆత్మవిశ్వాసం నింపారు.

అమెరికాలో శిక్షణ ఎలా ఉపయోగపడింది?

ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమిది. ఆసియా ఛాంపియన్‌షిప్‌ తర్వాత 2, 3 నెలలు అమెరికాలో శిక్షణ తీసుకుంటే బాగుండేదని అనుకున్నాం. కరోనా రెండో దశ నేపథ్యంలో అమెరికాకు వెళ్లే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నారు. సరిగ్గా ఒకరోజు ముందు అమెరికా విమానం ఎక్కాం. అక్కడ కోచ్‌ విజయ్‌శర్మ ఆధ్వర్యంలో నేను శిక్షణ తీసుకున్నా. టోక్యోకు ముందు అమెరికాలో శిక్షణ చాలా ఉపయోగపడింది.

మీ పతకంతో ఎలాంటి మార్పు ఆశిస్తున్నారు?

కచ్చితంగా మార్పు ఉంటుంది. నన్ను చూసి కొందరైనా అమ్మాయిలు క్రీడారంగంలో అడుగుపెడతారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను ప్రోత్సహించాలి. కేవలం చదువుకే పరిమితం చేయొద్దు. నచ్చిన రంగంలో.. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. అమ్మాయిలు తల్చుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. క్రీడల్లో దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురాగలరు. అమ్మాయిల్ని క్రీడల్లోకి వచ్చేలా చేయండి.

భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో గొప్ప ప్రదర్శనతో రజతం పట్టేసింది. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో బరువులెత్తి పతకం సాధించింది. అసలు ఈ స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌ అంటే ఏమిటో తెలుసా?

స్నాచ్‌

* స్నాచ్‌లో లిఫ్టర్లు బరువులను ఏకబిగిన పైకెత్తుతారు.

* బరువులతో కూడిన రాడ్డుపై పట్టు కోసం వెయిట్‌లిఫ్టర్లు రెండు చేతుల మధ్యలో వీలైనంత ఎక్కువ దూరం ఉండేలా దాన్ని పట్టుకుంటారు.

* మోకాళ్లపై భారం పడేలా కూర్చుని (బస్కీలు తీసినట్లుగా) ఒక్కసారిగా బార్‌ను ఎత్తుతారు. అది నడుం వరకూ రాగానే చీలమండలు, మోకాళ్లు, నడ్డి ఆధారంగా పూర్తి బలాన్ని తెచ్చుకుని ఆ బరువును తలపైకి తీసుకెళ్తారు.

* ఆ సమయంలో ఎత్తిన బరువు కారణంగా కిందకు వంగిన శరీరాన్ని నిటారు చేస్తూ నిలబడతారు. ఇలా చేస్తేనే స్నాచ్‌ పూర్తి చేసినట్లు పరిగణిస్తారు. ఒకవేళ బరువెత్తిన తర్వాత నిలబడకపోయినా, శరీరం ఎక్కువగా వణికినా విఫలమైనట్లే.

meera
స్నాచ్‌

క్లీన్‌ అండ్‌ జెర్క్‌

* స్నాచ్‌ ఫిట్‌నెస్‌కు పరీక్షగా నిలిస్తే.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ మాత్రం వెయిట్‌లిఫ్టర్ల ముడి శక్తికి సవాలు విసిరేలా ఉంటుంది.

* దీంట్లో క్లీన్‌, జెర్క్‌ అనే రెండు అంశాలు ఉన్నప్పటికీ దీన్ని ఒకేసారి పూర్తి చేస్తారు.

* బరువు ఎత్తడానికి బార్‌ను పట్టుకునేటప్పుడు రెండు చేతుల మధ్య దూరాన్ని తగ్గిస్తారు.

* కిందకు వంగి మోకాళ్లపై భారం పడేలా కూర్చుని ఒక్కసారిగా బార్‌ను ఎత్తి ఛాతీపైనా పెట్టుకుంటారు. దీంతో క్లీన్‌ పూర్తయినట్లు.

* బరువు ఎత్తడం వల్ల మళ్లీ బస్కీలు తీస్తున్నట్లు కూర్చునే స్థితికి వెయిట్‌లిఫ్టర్లు వస్తారు.

* ఇప్పుడు ఆ బరువుతో పాటు లేచి ఆ బార్‌ను తలపైకి ఎత్తాల్సి ఉంటుంది. అలా చేసి నియంత్రణ కోల్పోకుండా ఉంటే జెర్క్‌ పూర్తవుతుంది. ఇలా క్లీన్‌ అండ్‌ జెర్క్‌ ముగుస్తుంది. స్నాచ్‌తో పోలిస్తే క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోనే వెయిట్‌లిఫ్టర్లు ఎక్కువ బరువులు ఎత్తుతారు. తల మీదకు బార్‌ను ఎత్తేకంటే ముందు ఛాతీపైన పెట్టుకునే అవకాశం ఉండడమే అందుకు కారణం.

meera
క్లీన్​ అండ్​ జెర్క్​

ఇదీ చూడండి: టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం- వెయిట్​లిఫ్టింగ్​లో రజతం

నాడు మల్లీశ్వరి.. నేడు మీరా.. ఒలింపిక్స్​లో నారీశక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.