ETV Bharat / sports

'నవ భారతావనికి ఈ హాకీ వనితలు స్ఫూర్తి' - రాణిరాం పాల్​

ఒలింపిక్స్​ కాంస్య పతక పోరులో భారత మహిళలు ఓడినప్పటికీ.. తమ ప్రదర్శనతో యావత్​ దేశానికి స్ఫూర్తినిచ్చారు. ఈ నేపథ్యంలో వారి ప్రదర్శనతో గర్వపడుతున్నామని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇది ముగింపు కాదని.. ప్రారంభమేనని అంటున్నారు.

hockey
హాకీ
author img

By

Published : Aug 6, 2021, 11:00 AM IST

చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో గ్రేట్​ బ్రిటన్​పై భారత మహిళల హాకీ జట్టు 3-4 తేడాతో ఓడిపోయింది. అయితే.. యావత్​ దేశమంతా 'మహిళలు ఓడిపోయారు.. పతకం తీసుకురాలేదు' అని మాట్లాడుకోకుండా.. 'మహిళలు భలే ఆడారు. ఇదీ మ్యాచ్​ అంటే..' అనుకుంటున్నారు. ఇందుకు కారణం వారి ప్రదర్శన. అంచనాలే లేకుండా బరిలో దిగి.. వావ్​! అనిపించుకునే స్థాయికి ఎదిగారు. ఇందులో వారి కుటుంబసభ్యుల పాత్ర ఎంతో కీలకం. నిత్యం అమ్మాయిలకు అండగా ఉంటూ ప్రోత్సహించారు. ఇక కాంస్య పతక పోరులో జట్టు విజయాన్ని చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు. ఓటమి అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నారు.

టీవీల ముందే..

ఉదయం నుంచే భారత క్రీడాభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. వారిలో హాకీ మహిళల జట్టు సభ్యుల కుటుంబాలు కూడా ఉన్నాయి. తమ అమ్మాయిలు బాగా రాణించి, దేశానికి పతకాన్ని తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు ఉదయం నుంచి టీవీల ముందే కూర్చుని మ్యాచ్​ను వీక్షించారు. ప్రతి గోల్​కు చప్పట్లతో అభినందించారు. పిల్లలు ఆనందంతో గంతులేశారు.

hockey
హరిద్వార్​లో వందన కటారియా కుంటుబసభ్యులు

చివరి నిమిషం వరకు గెలుపు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురైంది. మహిళల జట్టు 3-4తో ఓడిపోయింది. జట్టు కుటుంబసభ్యులు కూడా 'ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే' అని తమ అమ్మాయిలపై గర్వపడుతున్నారు.

"వాస్తవానికి ఇది ఓటమి కాదు. ఇక్కడి వరకు వచ్చినందుకు అమ్మాయిలను చూసి గర్వపడాల్సిన సమయం."

-గురు చరణ్​ సింగ్​, గుర్జిత్​ సింగ్​ సోదరుడు.

"ఇది ఓటమి కాదు. మహిళల పోరాటానికి ఇదొక గొప్ప విజయం. తిరిగొస్తున్న రాణికి ఘన స్వాగతం లభిస్తుంది. ఎందరో అమ్మాయిలకు ఈ మహిళా జట్టు స్ఫూర్తిగా నిలుస్తుంది."

-రాణి రాంపాల్​ తండ్రి

"గెలుపోటములు ఆటలో భాగం. ముందుముందు జట్టు గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది."

-నేహా గోయల్​ తల్లి.

hockey
భావోద్వేగంతో నేహా గోయల్​ తల్లి కన్నీరు

ప్రధాని ట్వీట్​..

మహిళల జట్టును చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.

"ఈ జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. టోక్యోలో మన మహిళల జట్టు చేసిన ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తృటిలో పతకం కోల్పోయాం. కానీ నవ భారతానికి ఈ జట్టు స్ఫూర్తి. ఒలింపిక్స్​లో వారి విజయం.. భావి తరాల ఆడబిడ్డలకు స్ఫూర్తినిచ్చి.. వారిని హాకీవైపు అడుగులు వేసేలా చేస్తుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

"మైదానంలో మహిళల హాకీ జట్టు ప్రదర్శనతో ప్రతి భారతీయుడి మనసును గెలుచుకుంది. జట్టును చూసి గర్విస్తున్నాం."

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి.

కోచ్​ స్పందన..

మహిళల జట్టు ఈ స్థాయిలో ఆడిందంటే.. కుటుంబసభ్యులతో పాటు కోచ్​ జార్డ్​ మారిజ్నే పాత్ర కూడా ఎంతో ఉంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ఓడిన అనంతరం మాట్లాడిన ఆయన ఈ ఒలింపిక్స్​లో తమ జట్టు గొప్ప విజయాల్ని సాధించిందని అభిప్రాయపడ్డారు.

"మేము మెడల్​ గెలవకపోయుండచ్చు. కానీ అంతకన్నా పెద్ద విజయాన్నే సాధించాం. భారతీయులను గర్వపడేలా చేశాం. కష్టపడుతూ, మనం చేసేదానిపైన నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని లక్షలాది మంది అమ్మాయిలకు నిరూపించాం. మాకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు."

-జార్డ్​ మారిజ్నే, మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్​.

ఇదీ చూడండి:- హాకీ స్టిక్ సింహనాదం.. అభిమానుల భావోద్వేగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.