ETV Bharat / sports

Paralympics: సిక్స్​లు కొట్టాల్సింది​.. పారాలింపిక్స్​ పతకం పట్టేశాడు! - టోక్యో పారాలింపిక్స్​ 2020

క్రికెట్​ అంటే ఇష్టం.. కానీ, బ్యాడ్మింటన్​ అంటే ఎంతో ప్రేమ! అందుకే కెరీర్​లో తన మనసు చెప్పిన ప్రేమనే ఎంచుకున్నాడు. చివరికి పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఇది పారా-బ్యాడ్మింటన్​ అథ్లెట్​ ప్రమోద్​ భగత్​ జీవితకథ. క్రికెట్​పై ఉన్న తన ఇష్టాన్ని బ్యాడ్మింటన్​పై ప్రేమగా ఎలా మార్చుకున్నాడో(Pramod Bhagat Biography) తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Pramod Bhagat Wins India First Ever Gold In Badminton
బ్యాడ్మింటన్​లో స్వర్ణ పతకం సాధించిన క్రికెటర్​!
author img

By

Published : Sep 5, 2021, 5:31 AM IST

టోక్యో పారాలింపిక్స్​(Tokyo Paralympics) బ్యాడ్మింటన్​లో ఎస్​ఎల్​-3 విభాగంలో విజేతగా నిలిచిన ప్రమోద్​ భగత్​(Pramod Bhagat Badminton).. ఆ క్రీడలో స్వర్ణం పతకం సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. ఒడిశాలోని అట్టబిరా గ్రామానికి చెందిన ఇతడు​.. ఐదేళ్ల వయసులోనే పొలియో(Pramod Bhagat Disability) బారినపడ్డాడు. అతడి ఎడమ కాలికి లోపం ఉన్నా.. బ్యాడ్మింటన్​పై ప్రేమను వదులుకోలేదు.

క్రికెట్​ అంటే ఇష్టమే!

చిన్నతనం నుంచి క్రికెట్​ను ఇష్టపడిన ప్రమోద్​​.. ప్రాంతీయ​ టోర్నీల్లో ఓపెనర్​గా​ బ్యాటింగ్​ చేసేవాడు. వయసు పెరిగేకొద్ది బ్యాడ్మింటన్​పై అవగాహన తెచ్చుకొని.. దానిపై ప్రేమతో పాటు నైపుణ్యాలను పెంచుకున్నాడు. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పాఠశాల విడిచిపెట్టగానే.. అందరిలాగా టీవీకి అతుక్కుపోకుండా, తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్​ చూసేందుకు మైదానానికి వెళ్లేవాడినని ఓ ఇంటర్వ్యూలో ప్రమోద్​ వెల్లడించాడు.

అలా బ్యాడ్మింటన్​పై ప్రేమను పెంచుకొని.. తన పాఠశాలలో సీనియర్లతో సాధన చేయడం మొదలెట్టాడని అన్నాడు. ఆటలో తన ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోయారని చెప్పాడు. ఆ విధంగా జిల్లా స్థాయి పోటీల్లో ఛాంపియన్​గా నిలిచి.. అందరి దృష్టిని ఆకర్షించినట్లు వెల్లడించాడు. అనంతరం ఆ క్రీడలో ప్రొఫేషనల్​గా ఎదగాలని భావించినట్లు పేర్కొన్నాడు.

ఆ కోచ్​ సహాయంతో..

తాను పారా-అథ్లెట్​గా మారేందుకు కోచ్​ ఎస్​పీ దాస్​ ఎంతగానో సహాయపడ్డారని ప్రమోద్​ చెప్పాడు. ఆయన సహాయసహకారాలు, సూచనలు.. తనను అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగేందుకు ఎంతో దోహదపడ్డాయని ప్రమోద్​ భగత్​ వెల్లడించాడు.

పారాలింపిక్స్​లో..

ప్రమోద్​ భగత్​.. ప్రస్తుతం పారాబ్యాడ్మింటన్​లో ప్రపంచ నంబరు1 ర్యాంక్​లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు టోక్యో పారాలింపిక్స్​ బ్యాడ్మింటన్​ ఎస్​ఎల్​3 క్లాస్​ విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని(Pramod Bhagat Gold) ముద్దాడాడు.

ఇదీ చూడండి.. Tokyo Paralympics: బ్యాడ్మింటన్​లో భారత్​కు స్వర్ణం, కాంస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.