ప్రధాని నరేంద్ర మోదీ(modi meets olympic athletes).. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవ్వకముందు నుంచి ఇప్పటివరకు(పారాలింపిక్స్ ముగిసిన తర్వాత) భారత అథ్లెట్లలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు. ఇటీవల ఒలింపిక్స్ పతక విజేతలకు ఆత్మీయ అతిథ్యం ఇచ్చిన మోదీ.. ఇప్పుడు పారాలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన అథ్లెట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కో క్రీడాకారుడితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారి విజయాలను, కృషిని ప్రశంసించారు. అంతకుముందు కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అథ్లెట్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో(tokyo paralympics india medals) భారత్ అదరగొట్టేసింది. చరిత్రలో లేనంత అత్యుత్తమ ప్రదర్శనతో తమ ప్రయాణాన్ని ముగించింది. ఉత్కంఠంగా సాగిన ఈ పోటీల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశప్రజల మనసులు గెలుచుకున్నారు. పారాలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు(19) సాధించి దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: Paralympics 2021: మనోళ్లు పతకాల ప్రభంజనం.. చరిత్రలోనే తొలిసారి