ETV Bharat / sports

ఒలింపిక్స్ మ్యాచ్​లు.. ఆ దేశంలో ఇప్పుడు ప్రసారం!

టోక్యో ఒలింపిక్స్​ ఆగస్టు 8న ముగిశాయి. కానీ, ఆగస్టు 10న విశ్వక్రీడలకు సంబంధించి ఓ ఫుట్​బాల్​ మ్యాచ్.. ఆ దేశంలో​ ప్రసారమైంది. అదేంటి ఇంతకీ ఎక్కడ ఇలా జరిగింది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Korea Central TV
కొరియా సెంట్రల్ టీవీ
author img

By

Published : Aug 13, 2021, 5:19 PM IST

ఒలింపిక్స్​ ముగిసిన రెండ్రోజుల తర్వాత (ఆగస్టు 10న) విశ్వక్రీడలకు సంబంధించి ఓ ఫుట్​బాల్​ మ్యాచ్​ను ప్రసారం చేసింది ఉత్తర కొరియా టీవీ ఛానెల్. ఈ విషయాన్ని ఆ దేశ స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. జులై 21న యూకే, చిలీ మధ్య జరిగిన మహిళల ఫుట్​బాల్​ మ్యాచ్​ను 70 నిమిషాల పాటు కొరియన్​ సెంట్రల్​ టెలివిజన్​ (కేసీటీవీ) ప్రసారం చేసింది. ఈ వీడియో ఎలా వచ్చిందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ఆ వీడియో క్వాలిటీతో పాటు కామెంట్రీ కూడా సరిగా లేదని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో పాటు చైనా, బ్రెజిల్​ మధ్య జరిగిన మ్యాచ్​ కూడా ప్రసారమైనట్లు తెలుస్తోంది. కానీ, ఇందుకు సంబంధించి ఆధారాలేమి లేవు.

ఉత్తర కొరియాలో ఇలాంటి పొరపాట్లు జరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఒలింపిక్స్, ఇతర ఆటలకు సంబంధించి మ్యాచ్​లు చాలా ఆలస్యంగా ప్రసారమయ్యేవి. నిర్ణీత సమయానికి కాకుండా వారాలు, సంవత్సరాలు ఆలస్యమైన సందర్భాలున్నాయి. 2016 రియో ఒలింపిక్స్​ ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత ఆ దేశంలో మ్యాచ్​ల ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

కరోనా నేపథ్యంలో ఈ సారి ఉత్తర కొరియా నుంచి ఏ ఒక్క అథ్లెట్​ను ఒలింపిక్స్​కు పంపలేదు. కొవిడ్​ నుంచి ప్రజలను కాపాడలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రీడాశాఖ ప్రకటించింది. 33 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా విశ్వక్రీడల నుంచి తప్పుకోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 1988 ఒలింపిక్స్​లోనూ ఆ దేశం పాల్గొనలేదు. ఒలింపిక్స్​లో ఇప్పటివరకు 16 స్వర్ణాలతో సహా మొత్తంగా 57 పతకాలు తన ఖాతాలో వేసుకుంది ఉత్తర కొరియా.

ఇదీ చదవండి: Olympics 2021: ఆ ప్లేయర్​కు​ మరో గోల్డ్​ మెడల్.. అదే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.