ETV Bharat / sports

Tokyo 2020: ఆర్చరీలో క్వార్టర్స్​కు.. షూటింగ్​లో నిరాశ

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఆర్చరీలో జోష్​ చూపిన మిక్స్​డ్ టీమ్​ క్వార్టర్స్​ చేరుకోగా.. షూటింగ్​లో మహిళలు నిరాశపరిచారు.

.
.
author img

By

Published : Jul 24, 2021, 8:21 AM IST

Updated : Jul 24, 2021, 8:49 AM IST

ఒలింపిక్స్​లో తొలిరోజు పోటీల్లో భారత్​ ఆర్చర్లు అదరగొట్టారు. శనివారం జరిగిన మిక్స్​డ్ టీమ్​ విభాగంలో దీపికా కుమారి-ప్రవీణ్ జాదవ్.. చైనీస్​ తైపీపై 5-3 తేడాతో గెలిచి, క్వార్టర్​ ఫైనల్​కు అర్హత సాధించారు. క్వార్టర్స్​లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా తలపడనుంది.

.
.

షూటింగ్​లో నిరాశ..

షూటింగ్​లో మాత్రం భారత్​ నిరాశపరిచింది. ప్రపంచ నం.1 మహిళా షూటర్ ఎలవెనిల్ వలరివన్.. కనీసం మెడల్​ రౌండ్​కు అర్హత సాధించలేకపోయింది. 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్ పోటీలో ఈమెతో పాటు అపూర్వీ చండేలా కూడా పోటీపడింది. కానీ వీరిద్దరూ వరుసగా 16, 36 స్థానాల్లో నిలిచి 626.5, 621.9 పాయింట్లు సాధించారు. అయితే తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్నవారే మెడల్ రౌండ్​కు అర్హత సాధిస్తారు.

చైనా షూటర్​ యాంగ్​ క్యాన్​ గోల్డ్​ మెడల్​ సాధించింది. ఈ ఒలింపిక్స్​లో తొలి బంగారు పతకం ఇదే.

ఇవీ చదవండి:

Last Updated : Jul 24, 2021, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.