1964 తర్వాత రెండోసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన జపాన్ విశ్వక్రీడలను ఘనంగా ముగించింది. మరి ఇప్పుడు అందరి నోట ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయి. ఏ దేశం ఎక్కువ స్వర్ణాలు సాధించింది. అగ్రస్థానంలో ఎవరున్నారనే చర్చలే.
![Japan has its best Olympic medal haul: 27 gold, 58 overall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12711858_s.jpg)
నిన్నటివరకు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చైనాను దాటేసి ఈసారి కూడా అమెరికానే టాప్‌లో నిలిచింది. 39 స్వర్ణాలు, 41 వెండి, 33 కాంస్యాలు.. మొత్తంగా 113 మెడల్స్‌తో అగ్రరాజ్యం తొలి స్థానాన్ని దక్కించుకుంది. 38 పసిడి పతకాలతో పాటు 32 రజతాలు, 18 కాంస్యాలు మొత్తం 88 పతకాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనానే నిలిచాయి.
సొంతగడ్డపై జరిగిన ఒలింపిక్స్‌లో జపాన్ అథ్లెట్లు సత్తా చాటారు. ఈసారి అత్యధికంగా ఆ దేశం 27 స్వర్ణాలు, 14 రజతాలతో పాటు 17 కాంస్యాలు గెలుపొందింది. మొత్తంగా 58 పతకాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 1964, 2004 ఒలింపిక్స్ల్లో 16 గోల్డ్ మెడల్స్ చొప్పున గెలుపొందిన జపాన్.. గత రియో విశ్వక్రీడల్లో 12 బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకుంది.
![Japan has its best Olympic medal haul: 27 gold, 58 overall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12711858_sdj.jpg)
పతకాల పట్టికలో గ్రేట్ బ్రిటన్ నాలుగో స్థానంలో నిలిచింది. 22 పసిడి, 21 వెండి, 22 కంచు పతకాలు ఆ దేశ అథ్లెట్లు గెలుపొందారు.
ఇక భారత్.. ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలతో ఈ జాబితాలో 48వ స్థానంలో నిలిచింది. 2012 లండన్ విశ్వక్రీడల్లో 6 పతకాలు గెలుపొందింది. తాజాగా ఆ సంఖ్యను అధిగమించింది భారత్.
![Japan has its best Olympic medal haul: 27 gold, 58 overall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12711858_niraj.jpg)
ఇదీ చదవండి: ఒలింపిక్స్ విజేతలకు నజరానా.. ఏ దేశంలో ఎంత?