ETV Bharat / sports

Olympics 2021: ఆ ప్లేయర్​కు​ మరో గోల్డ్​ మెడల్.. అదే కారణం - olympics latest news

జపాన్ క్రీడాకారిణికి మరో స్వర్ణం ఇచ్చేందుకు ఐఓసీ సిద్ధమైంది. ఆమె ఊరి మేయర్​ చేసిన పనే ఇందుకు కారణం. ఇంతకీ ఏం జరిగింది?

Japan athlete to get nibbled gold medal replaced
ఒలింపిక్స్
author img

By

Published : Aug 13, 2021, 5:31 AM IST

Updated : Aug 13, 2021, 11:51 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్​ గెలుచుకున్న ఓ క్రీడాకారిణికి దాని బదులు మరో మెడల్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) వెల్లడించింది.

ఇంతకీ ఏమైంది?

జపాన్ సాఫ్ట్​బాల్ టీమ్​.. ఒలింపిక్స్​లో స్వర్ణం గెలుచుకుంది. ఆ జట్టులో సభ్యురాలు.. తన ఊరి మేయర్​ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఆ సమయంలో తన పతకాన్ని ఆయన మెడలో వేసింది. అయితే సదరు మేయర్​ ఆ మెడల్​ను కొరుకుతూ, ఒలింపియన్​లా పోజులిచ్చారు. దీంతో నెటిజన్లు తెగ విమర్శలు చేశారు. ఫలితంగా ఆయన క్షమాపణలు చెప్పారు.

సదరు సాఫ్ట్ బాల్ ప్లేయర్​ కోరిక మేరకు ఆ గోల్డ్ మెడల్​ మార్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంగీకారం తెలిపింది.

జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగిన ఒలింపిక్స్​లో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, భారత్ ఏడు పతకాలతో 48వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 13, 2021, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.