ETV Bharat / sports

Tokyo Olympics: ఆ 'స్వర్ణం​' వెనక ఇంత కథ జరిగిందా!

author img

By

Published : Aug 12, 2021, 8:18 AM IST

టోక్యో ఒలింపిక్స్​ పురుషుల 110 మీటర్ల హర్డిల్స్​ రేస్​లో ప్రపంచ ఛాంపియన్​ గ్రాంట్​కే షాక్​ ఇచ్చి పసిడిని ఎగరేసుకుపోయాడు జమైకన్​ అథ్లెట్​ హాన్స్​లే పార్చ్​మెంట్. అయితే ఓ దశలో అతడు సెమీస్​లో ఆడలేని పరిస్థితి ఎదుర్కొన్నాడు. కానీ ఓ వాలంటీర్ సాయంతో ఏకంగా పసిడినే గెలిచాడు.

Hansle Parchment
హాన్స్​లే

రాసిపెట్టి ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం అనుకున్నది కచ్చితంగా జరుగుతుందని జమైకన్​ అథ్లెట్​ హన్స్​లే పార్చ్​మెంట్​కు జరిగిన ఓ సంఘటన మరోమారు నిరూపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్​ పురుషుల 110మీటర్ల హర్డిల్స్​ రేస్​లో స్వర్ణంతో మెరిశాడు హాన్స్​లే. అయితే ఓ సందర్భంలో అతడు అసలు సెమీస్​ ఆడలేని పరిస్థితి నెలకొంది. ఓ వాలంటీర్​ సాయంతో పరిస్థితి నుంచి గట్టెక్కి.. చివరికి గోల్డ్​ గెలిచాడు. ఈ విషయాన్ని హాన్స్​లే తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్(Hansle Parchment instagram)​ చేశాడు.

అసలేం జరిగిందంటే..

"ఇది సెమీస్​ సమయంలో జరిగింది. చెవిలో ఇయర్​ఫోన్స్​ పెట్టుకుని పాటలు వింటున్నా. 'ట్రాక్​ అండ్​ ఫీల్డ్​' అని రాసుందని ఓ బస్సు ఎక్కా. ఇయర్​ఫోన్స్​ వల్ల బస్సులో మాటలు వినపడలేదు. కొద్దిసేపటికి వేరే మార్గంలో వెళుతున్నట్టు అర్థమైపోయింది. చుట్టుపక్కన ఏవీ తెలియవు. అలా బస్సు ఎక్కి వేరే స్టేడియానికి వెళ్లిపోయా. అక్కడ రోయింగ్​ పోటీలు జరుగుతున్నట్టు ఉన్నాయి. అక్కడ అడిగితే.. మళ్లీ ఒలింపిక్స్​ గ్రామానికి వెళ్లి.. అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కాల్సిందే అన్నారు. నేను అది చేసుంటే.. అస్సలు సమయం ఉండేది కాదు. ఒలింపిక్స్​ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాక్సీ తీసుకునేందుకు ప్రయత్నించా. కానీ దొరకలేదు అప్పుడే ఓ వాలంటీర్​ను చూశా. ఆమె నాకు ట్యాక్సీ తీసుకొచ్చింది. డబ్బులు కూడా ఇచ్చింది. అలా సమయానికి సరైన స్టేడియంకు వెళ్లగలిగా. ప్రాక్టీస్​ చేయగలిగా. ఆమె వల్లే నాకు గోల్డ్​ వచ్చింది."

- హాన్స్​లే పార్చ్​మెంట్​, అథ్లెట్​.

అలా.. సెమీస్​ మిస్​ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ హాన్స్​లే.. ఒలింపిక్స్​ పురుషుల 110మీటర్ల హర్డిల్స్​లో ప్రపంచ ఛాంపియన్​ గ్రాంట్​ హాల్లోవేను ఓడించి అందరికీ షాక్​ ఇచ్చాడు​. పార్చ్​మెంట్​.. 13.04 సమయంతో పసిడిని ముద్దాడగా.. హాల్లోవే 13.09తో సిల్వర్​ దక్కించుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు హాన్స్​లే ఆ వాలంటీర్​ను మళ్లీ కలిశాడు. ఆమెకు తన గోల్డ్​ మెడల్​ను చూపించాడు. ఓ టీ షర్ట్​తో పాటు కొంత డబ్బులు కూడా ఇచ్చాడు.

ఇదీ చూడండి:- టోక్యో ఒలింపిక్స్​లో అన్ని 'వ్యర్థ' పతకాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.