టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) పాల్గొన్న అథ్లెట్ల చివరి బృందం స్వదేశానికి చేరుకుంది. అందులో షూటింగ్ సెన్షెషన్ అవని లేఖరా, బ్యాడ్మింటన్ ప్లేయర్ సుహాస్ యతిరాజ్ ఉన్నారు. వీరంతా సోమవారం దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) అధికారులతో పాటు వారివారి కుటుంబసభ్యులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
సోమవారం స్వదేశం చేరుకున్న పారా-అథ్లెట్లలో(Indian Para Athletes) బ్యాడ్మింటన్, షూటింగ్, ఆర్చరీ బృందాలున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లతో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్.. 19 మెడల్స్ సాధించిన పతకాల పట్టికలో(Indian Medals In Paralympics) 24వ స్థానానికి చేరుకుంది. అందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి.
ఇదీ చూడండి.. కపిల్‌దేవ్ రికార్డును అధిగమించిన బుమ్రా