ETV Bharat / sports

Tokyo Paralympics: జావెలిన్​ త్రోలో భారత్​కు రెండు పతకాలు - జావెలిన్​ త్రో

India's Devendra Jhajharia wins silver, Sundar Singh wins bronze in javelin throw class F45 at Tokyo Paralympics
Tokyo Paralympics: జావెలిన్​ త్రోలో భారత్​కు రెండు పతకాలు
author img

By

Published : Aug 30, 2021, 8:59 AM IST

Updated : Aug 30, 2021, 10:32 AM IST

08:57 August 30

రజతం, కాంస్య పతకాలు కైవసం

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌పతకాల పంట పండిస్తోంది. సోమవారం జరిగిన ఒక్క జావెలిన్ త్రో ఈవెంట్​లోనే భారత్‌కు రజతం, కాంస్య పతకాలు దక్కాయి. F46 విభాగంలో 64.35 మీటర్ల దూరం విసిరి దేవేంద్ర ఝజారియా రజతాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో సుందర్ సింగ్.. 64.01 దూరం విసిరి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.  

సిల్వర్​ మెడల్​ సాధించిన దేవేంద్ర ఝజారియా 64.35 మీ., బ్రౌంజ్​ మెడల్​ విన్నర్​ సుందర్​ 62.58 మీ. దూరం ఈటెను విసిరారు. వీరిద్దరి కంటే మెరుగ్గా శ్రీలంకకు చెందిన దినేశ్​ ప్రియన్​ అత్యధికంగా 67.79 మీ. దూరం ఈటెను విసిరి బంగారు పతకాన్ని సాధించాడు.

ఈ సందర్భంగా దేవేంద్ర ఝజారియా, సుందర్​ సింగ్​లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.  

"దేవేంద్ర ఝజారియా నుంచి అద్భుతమైన ప్రదర్శన. అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు(దేవంద్ర) రజత పతకాన్ని సాధించారు. దేవేంద్ర భారతదేశాన్ని గర్వపడేలా చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు నా అభినందనలు. భవిష్యత్​లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను".  

                      - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

"సుందర్ సాధించిన కాంస్య పతకంతో భారతదేశం సంతోషంగా ఉంది. అతను అద్భుతమైన ధైర్యం అంకితభావంతో ప్రదర్శన చేశాడు. ఈ సందర్భంగా అతడికి నా అభినందనలు. భవిష్యత్​ ప్రణాళికల్లోనూ సుందర్​కు మంచి జరగాలని కోరుకుంటున్నా" అని మోదీ ట్వీట్​ చేశారు.  

Last Updated : Aug 30, 2021, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.