టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం అందింది. షూటింగ్లో సింగ్‌రాజ్ అధానా కాంస్యం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 కేటగిరీలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.
భారత్ తరపున పాల్గొన్న మరో షూటర్ మనీశ్ నర్వాల్ ఫైనల్స్‌లో ఏడో స్థానంలో నిలిచాడు.
తాజా గెలుపుతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటికే జావెలిన్ త్రో (ఎఫ్64, ఎఫ్46) కేటగిరీల్లో ఓ పసిడి, కాంస్యం దక్కాయి. షూటింగ్ మహిళల విభాగంలో ఒక స్వర్ణం భారత్ గెలుచుకుంది.