టోక్యో ఒలింపిక్స్‌లో 14వ రోజు భారత బృందానికి పలు ఈవెంట్లలో పతకాలు వచ్చే అవకాశం ఉంది. పురుషుల హాకీలో జర్మనీపై భారత్ గెలిస్తే కాంస్య పతకం వస్తుంది. అలాగే రెజ్లింగ్‌లో రవి దాహియా 57 కిలోల విభాగంలో ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. గురువారానికి సంబంధించి భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..
గోల్ఫ్..
- మహిళల రెండో రౌండ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 4.00 గంటలకు ప్రారంభం అవుతుంది. భారత్ తరఫున అదితి అశోక్ పాల్గొంటుంది.
- మరో మహిళల రౌండ్-2 మ్యాచ్ ఉదయం 5.44 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో ఇండియా నుంచి దీక్షా దగర్ పాల్గొంటుంది.
హాకీ..
- ఇప్పటికే సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడిన భారత జట్టుకు స్వర్ణంతో పాటు రజతం గెలిచే అవకాశం లేకుండా పోయింది. జర్మనీతో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కనీసం కాంస్యమైన దక్కుతుంది. ఈ మ్యాచ్ ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుంది.
రెజ్లింగ్..
- మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ పోటీ ఉదయం 7.37 గంటలకు ప్రారంభం అవుతుంది.
- ఈ మ్యాచ్‌లో గెలిస్తే అన్షు మాలిక్ అదే విభాగంలో కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. ఆ పోటీ సాయంత్రం 5.35 గంటలకు ఉంటుంది.
- మహిళల 53 కిలోల ఫ్రీ స్టైల్ 1/8 ఫైనల్ మ్యాచ్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ పాల్గొననుంది. ఈ పోటీ ఉదయం 8.00 గంటలకు స్టార్ట్ అవుతుంది.
- ఈ మ్యాచ్‌లో ఫోగట్ గెలుపొందితే అదే విభాగంలో క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ ఉదయం 8.56 గంటలకు ఉంటుంది.
- ఒకవేళ క్వార్టర్స్‌లోనూ వినేశ్ విజయం సాధిస్తే సెమీస్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.25 గంటలకు జరుగుతుంది.
- 57 కిలోల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో రవి దాహియా మ్యాచ్ సాయంత్రం 4.20 గంటలకు జరుగుతుంది. ఇందులో అతడు గెలిస్తే ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే వెండి పతకం సొంతమవుతుంది.
- సెమీస్‌లో ఓడిన రెజ్లర్ దీపక్ పూనియా కాంస్య పతక పోరుకు సిద్ధం కానున్నాడు. 86 కిలోల విభాగంలో పోటీ పడనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 4.40 గంటలకు ఉంటుంది.
అథ్లెటిక్స్..
- పురుషుల 20 కి.మీ.ల రేస్ వాక్ ఫైనల్ పోటీలు మధ్యాహ్నాం 1.00 గంటలకు ప్రారంభమవుతాయి. భారత్ నుంచి కేటీ ఇర్ఫాన్, రాహుల్ రోహిల్లా, సందీప్ కుమార్ పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: Olympics Day 12: రవికుమార్, నీరజ్ చోప్రా జోరు.. లవ్లీనా రికార్డు