ETV Bharat / sports

Olympics Live: సెమీస్​కు సింధు.. మెన్స్ హాకీ జట్టు మరో విజయం - ఒలింపిక్స్​ ఆర్చరీ

ARCHERY, OLYMPICS
ఆర్చరీ, ఒలింపిక్స్​
author img

By

Published : Jul 30, 2021, 6:17 AM IST

Updated : Jul 30, 2021, 6:41 PM IST

16:28 July 30

హాకీలో దూకుడు..

పురుషుల హాకీ పూల్​ ఏ మ్యాచ్​లో భారత్​ దూకుడు ప్రదర్శించింది. జపాన్​తో జరిగిన పోరులో 5-3 తేడాతో గెలుపొందింది. 

14:52 July 30

సింధు విజయం..

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్​​ మహిళల సింగిల్స్​ క్వార్టర్​ఫైనల్స్​లో భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు విజయం సాధించింది. ప్రత్యర్థి జపాన్​ క్రీడాకారణి యమగూచిపై 2-0 తేడాతో సెట్లను కైవసం చేసుకుంది. ముఖ్యంగా రెండో సెట్​లో పోరు హోరాహోరీగా సాగింది. తొలి సెట్​ సింధు గెల్వగా.. రెండో సెట్లోను దూకుడు ప్రదర్శించింది. కానీ యమగూచి అనూహ్యంగా పుంజుకుని పైచేయి సాధించింది. కానీ చివర్లో పట్టుబిగించిన సింధు మ్యాచ్​ను నెగ్గింది. దీంతో ఈ తెలుగుతేజం సెమీస్​కు దూసుకెళ్లింది.
 
14:13 July 30

సింధు దూకుడు..

భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు.. దూకుడుగా ఆడుతోంది. క్వార్టర్​ ఫైనల్లో జపాన్​ షట్లర్​ యమగూచితో తలపడుతున్న సింధు.. తొలి సెట్​ను 21- 13తో కైవసం చేసుకుంది. 

ప్రత్యర్థిని కోర్టు మొత్తం పరుగులు పెట్టిస్తోంది సింధు. పదునైన స్మాష్​లతో అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తోంది. రియో ఒలింపిక్స్​లో రజతం గెల్చిన సింధు.. ఈసారి స్వర్ణమే దిశగా దూసుకెళ్తోంది. 

12:48 July 30

టార్గెట్​ గోల్డ్​..

మహిళల బాక్సింగ్​ వెల్టర్​ వెయిట్​ విభాగంలో(69 కేజీలు).. సెమీఫైనల్​ చేరిన భారత బాక్సర్​ లవ్లీనా తన లక్ష్యం బంగారు పతకమేనని చెబుతోంది. ప్రస్తుతం తన దృష్టంతా గోల్డ్​ మెడల్​ సాధించడంపైనే ఉందని, సెమీఫైనల్​ కోసం తీవ్రంగా శ్రమిస్తానని చెప్పుకొచ్చింది. 

11:30 July 30

క్వార్టర్​ ఫైనల్లో దీపిక ఓటమి..

ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో.. దీపిక ఓటమి పాలైంది. క్వార్టర్​ ఫైనల్లో టాప్​ సీడ్​, కొరియా ఆర్చర్ అన్​ సన్​​ చేతిలో 6-0 తేడాతో వరుస సెట్లలో ఓడింది. అన్​ సన్​ దూకుడు ముందు.. దీపిక కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 

10:51 July 30

మహిళల హాకీలో ఓ విజయం..

మహిళల హాకీ పూల్​ ఏ భారత్​ ఓ విజయం సాధించింది. ఐర్లాండ్​పై 1-0 తేడాతో గెలిచింది. నవనీత్​ కౌర్​ 57వ నిమిషంలో చేసిన గోల్​తో భారత్​ ఆధిక్యంలో నిలిచి.. మ్యాచ్​ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 4 మ్యాచ్​లాడిన భారత్​.. గ్రేట్​బ్రిటన్​, జర్మనీ, నెదర్లాండ్స్​ చేతిలో ఓడింది. తరువాతి మ్యాచ్​లో సౌతాఫ్రికాతో ఆడనుంది టీమ్​ ఇండియా. 

భారత్​కు క్వార్టర్ ఫైనల్​ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

10:10 July 30

సెయిలింగ్​..

సెయిలింగ్​లో వరుణ్​ టక్కర్​, కేసీ గణపతి.. 49er పురుషుల ఏడో రేసును 17వ స్థానంతో ముగించారు. 

10:07 July 30

అథ్లెటిక్స్​లో ప్చ్​..

పురుషుల 400 మీ. హర్డిల్స్​లో భారత అథ్లెట్​ ఎంపీ జబీర్​ 50.77 టైమింగ్​తో ఏడో స్థానంలో నిలిచాడు.

అంతకుముందు 100 మీ. పరుగులో ద్యుతి చంద్​, 3000 మీ. స్టీపుల్​ ఛేజ్​ హీట్స్​లో అవినాశ్​ సాబ్లే ఫైనల్​కు అర్హత సాధించలేకపోయారు. 

09:48 July 30

మీరాబాయికి స్వర్ణావకాశం లేదు..

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం అందించిన వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చాను.. బంగారు పతకం వచ్చే అవకాశాల్లేవు. 49 కేజీల విభాగంలో గోల్డ్​ మెడల్​ గెలిచిన.. చైనా వెయిట్​ లిఫ్టర్​ జిహుయ్ హౌకు డోపింగ్​ టెస్టులు చేయనున్నారని, అందులో పాజిటివ్​గా తేలితే.. మీరాకు స్వర్ణం దక్కుతుందని వార్తలొచ్చాయి.

అయితే.. ఇందులో నిజం లేదని అధికారులు తేల్చారు. అది పొరపాటుగా జరిగిందని, డోప్​ టెస్టుల గురించి ప్రస్తావనే రాలేదని తెలిసింది. 

ఫైనల్లో.. స్నాచ్​, క్లీన్​ అండ్ జెర్క్​ విభాగాల్లో 210 కేజీల బరువును ఎత్తి కొత్త ఒలింపిక్స్​ రికార్డును సృష్టించింది చైనా రెజ్లర్​ జిహుయ్ హౌ. మీరాబాయి 202 కేజీలను ఎత్తి.. రజతం గెల్చింది.

09:24 July 30

ద్యుతికి నిరాశ..

అథ్లెటిక్స్​లో భారత్​కు ఆశించిన శుభారంభం దక్కలేదు. స్టీపుల్​ చేజ్​లో ఇప్పటికే సాబ్లె సెమీఫైనల్​కు అర్హత సాధించకపోగా.. ఇప్పుడు మహిళల 100 మీ. పరుగులో ద్యుతి చంద్​ విఫలమైంది. ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది. 

08:53 July 30

మరో మెడల్​..

ఒలింపిక్స్​లో భారత్​కు మరో మెడల్​ ఖాయమైంది. మహిళల బాక్సింగ్​ వెల్టర్​ వెయిట్​(69 కేజీలు) విభాగంలో.. సెమీఫైనల్​కు చేరింది లవ్లీనా బోర్గోహైన్​. క్వార్టర్​ ఫైనల్లో చైనీస్​ తైపీ బాక్సర్​.. చెన్​-చిన్​ను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. 

సెమీఫైనల్లో.. టర్కీ బాక్సర్​ సుర్మేనేలి బుసానాజ్​తో తలపడనుంది. అందులో గెలిస్తే.. ఫైనల్​కు చేరుతుంది. ఓడినా.. ఆమెకు కాంస్యం దక్కుతుంది. 

08:34 July 30

బాక్సర్​ సిమ్రన్​జీత్​ ఓటమి..

మహిళల 60 కేజీల లైట్​ వెయిట్​ విభాగంలో.. భారత బాక్సర్​ సిమ్రన్​జీత్​ కౌర్​ ఓటమిపాలైంది. థాయ్​లాండ్​ బాక్సర్​ సీసోండీ చేతిలో 5-0 తేడాతో ఓడి.. ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది. 

07:17 July 30

మను బాకర్​కు నిరాశ..

షూటింగ్​లో ఆశలు పెంచిన మను బాకర్​ మళ్లీ ఫైనల్​ చేరడంలో విఫలమైంది. తుది 8 మందిలో నిలవలేకపోయింది. 600 పాయింట్లకుగానూ 582 స్కోరు చేసింది. క్వాలిఫికేషన్​ ప్రెసిషన్​లో 292 స్కోరు చేసిన మను.. ర్యాపిడ్​ ఫైర్​ రౌండ్​లో 2 పాయింట్లు తక్కువ చేసింది. 

06:46 July 30

సర్నోబత్​కు నిరాశే..

షూటింగ్​ మహిళల 25 మీ. పిస్టల్​ విభాగంలో.. భారత షూటర్​ రహి సర్నోబత్​ ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది. 600 పాయింట్లకుగానూ.. 573 స్కోరు మాత్రమే చేసింది. మను బాకర్​ ఇంకా పోటీపడాల్సి ఉంది. ఆమెకు మంచి అవకాశాలే ఉన్నాయి.  

06:35 July 30

స్టీపుల్​ ఛేజ్​లో జాతీయ రికార్డు..

అథ్లెటిక్స్​ పురుషుల 3000 మీ. స్టీపుల్​ ఛేజ్​ హీట్స్​లో భారత అథ్లెట్​ అవినాశ్​ సాబ్లె.. సెమీఫైనల్​ చేరడంలో విఫలమయ్యాడు. హీట్​-2 లో పోటీపడ్డ సాబ్లె.. 8:18:12 నిమిషాల్లో పరుగును పూర్తి చేశాడు. అది జాతీయ రికార్డు కావడం విశేషం.

అంతకుముందు సాబ్లె.. అత్యుత్తమ టైమింగ్​ 8.20.20గా ఉండేది.  

06:04 July 30

Olympics Live: ఆర్చరీ క్వార్టర్స్​లో దీపికా కుమారి

ఒలింపిక్స్​లో భారత ఆర్చర్​, ప్రపంచ నెం.1 దీపికా కుమారి.. మహిళల వ్యక్తిగత విభాగంలో క్వార్టర్​ ఫైనల్​కు చేరింది. రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్​ఓసీ) క్రీడాకారిణిపై 6-5 తేడాతో గెలిచింది. 

మ్యాచ్​ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. తొలి సెట్​ దీపికా కుమారి నెగ్గగా.. రెండో సెట్​ ప్రత్యర్థి గెలిచింది. మూడో సెట్​ మళ్లీ దీపికా నెగ్గింది. నాలుగో సెట్​ టై అయింది. ఐదో సెట్​ ప్రత్యర్థికే దక్కగా.. స్కోరు 5-5తో సమమైంది. షూట్​ ఆఫ్​లో రష్యా ఆర్చర్​ 7 పాయింట్ల స్కోరే చేయగా.. దీపికా 10 పాయింట్లు సాధించి మ్యాచ్​ గెలిచింది. 

Last Updated : Jul 30, 2021, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.