టోక్యో ఒలింపిక్స్‌లో ఈ మంగళవారం(ఆగస్టు 3) భారత బృందానికి కలిసిరాలేదు. ఆడిన అన్ని ఆటల్లోనూ పరాజయమే మిగిలింది.
-
Here's #TeamIndia 's daily roundup at #Tokyo2020
— SAIMedia (@Media_SAI) August 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch today's results from the @Olympics and don't forget to #Cheer4India @PMOIndia @ianuragthakur @NisithPramanik @WeAreTeamIndia @PIB_India @ddsportschannel pic.twitter.com/obKWvOdBg0
">Here's #TeamIndia 's daily roundup at #Tokyo2020
— SAIMedia (@Media_SAI) August 3, 2021
Watch today's results from the @Olympics and don't forget to #Cheer4India @PMOIndia @ianuragthakur @NisithPramanik @WeAreTeamIndia @PIB_India @ddsportschannel pic.twitter.com/obKWvOdBg0Here's #TeamIndia 's daily roundup at #Tokyo2020
— SAIMedia (@Media_SAI) August 3, 2021
Watch today's results from the @Olympics and don't forget to #Cheer4India @PMOIndia @ianuragthakur @NisithPramanik @WeAreTeamIndia @PIB_India @ddsportschannel pic.twitter.com/obKWvOdBg0
మంగళవారం భారత ఫలితాలు ఇవే..
స్వర్ణం ఆశలు ఆవిరి..
![India at a glance in Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12662129_sj.jpg)
ఒలింపిక్స్ ఆది నుంచి ఆకట్టుకున్న హాకీ పురుషుల జట్టు తుదిమెట్టుపై బోల్తా పడింది. స్వర్ణమే లక్ష్యంగా ముందుకు సాగిన మన్‌ప్రీత్ సింగ్ సేనకు సెమీస్‌లో బెల్జియం చేతిలో భంగపాటు తప్పలేదు. 2-5తో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక కాంస్య పోరులోనైనా నెగ్గి భారత్‌కు కనీసం పతకం దక్కేలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాంస్య పతకం కోసం.. ఆగస్టు 5న జర్మనీ- ఇండియా తలపడనున్నాయి.
![India at a glance in Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12662129_sk.jpg)
మూడు క్వార్టర్ల వరకు అద్భుతంగా పోరాడిన మన్‌ప్రీత్ సేన ఆఖరి క్వార్టర్లో చివరి ఐదు నిమిషాల వరకు విజయంపై ఆశలు రేపడం గమనార్హం. అయితే అలెగ్జాండర్ హెండ్రిక్స్ 19, 49, 53 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో టీమ్ ఇండియా కలలను చిదిమేశాడు.
![India at a glance in Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12662129_sh.jpg)
నాలుగో క్వార్టర్‌ను 2-2తో మొదలు పెట్టిన రెండు జట్లు ఒత్తిడిలోనే ఆడాయి. అయితే టీమ్ ఇండియా పదేపదే బంతిని అడ్డుకోవడం వల్ల బెల్జియంకు ఆయాచితంగా వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. మరోసారి హెండ్రిక్స్ ఒక పీసీని, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్స్‌గా మలచడం వల్ల బెల్జియం 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఆట ముగిసే ఆఖరి సెకన్లోనూ దొహెమన్ గోల్ చేసి బెల్జియంను 5-2తో గెలిపించాడు.
![India at a glance in Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12662129_a4.jpg)
సోనమ్ తొలి రౌండ్లోనే..
అచ్చొచ్చిన రెజ్లింగ్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. కెరీర్లో తొలి ఒలింపిక్స్ ఆడుతున్న సోనమ్ మాలిక్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 62 కేజీల విభాగంలో పోటీపడిన సోనమ్.. మంగోలియా రెజ్లర్ బోలోర్తుయా ఖురేల్ఖుపై 2-2 తేడాతో పరాజయం చవిచూసింది.
![India at a glance in Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12662129_a3.jpg)
తొలి మూడు నిమిషాల్లోనే ఆమె 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఈ 19 ఏళ్ల భారత రెజ్లర్. ఆ తర్వాత దూకుడు తగ్గించి రక్షణాత్మక విధానం ఎంచుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా ఆసియా రజత పతక విజేతైన బొలొర్తుయా.. సోనమ్‌ను(టేక్ డౌన్) ఎత్తిపడేసింది. దీంతో స్కోరు 2-2తో సమమైంది. ఆఖరి పాయింట్ చేసింది మంగోలియన్ కాబట్టి న్యాయనిర్ణేతలు ఆమెనే విజేతగా ప్రకటించారు.
షాట్‌పుట్..
![India at a glance in Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12662129_sksl.jpg)
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ తజిందర్ పాల్ సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. అర్హత మ్యాచ్‌లో 21.20 మీ. దూరం షాట్‌పుట్‌ను విసరాల్సి ఉంది. కానీ, తన తొలి ప్రయత్నంలో అతడు 19.99 మీ. మాత్రమే విసిరాడు. తర్వాత రెండు సార్లు ఫౌల్ వేశాడు. దీంతో 13వ స్థానంతో విశ్వక్రీడల నుంచి తప్పుకున్నాడు.
జావెలిన్ త్రో..
భారత మహిళ జావెలిన్ త్రో క్రీడాకారిణి అన్ను రాణి ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్లోనే విఫలమైంది. 14వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి ప్రయత్నంలో 50.35 మీ. విసిరిన అన్ను.. తర్వాత వరుసగా 53.19 మీ., 54.04 మీ. విసిరింది.
![India at Olympics: Heartbreak in semis but hockey medal dream still alive; disappointments galore in athletics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12662129_fd.jpg)
ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 63 మీ. దూరం విసరాల్సి ఉంది. పోలండ్ అమ్మాయి మరియా 65.24 మీ. విసిరి ఫైనల్‌కు అర్హత పొందింది.
ఇవీ చదవండి: