ETV Bharat / sports

మానసిక క్షోభకు గురిచేశారు: మేరీకోమ్​ - మేరీకోమ్​ టోక్యో ఒలింపిక్స్​

టోక్యో ఒలింపిక్స్​లో అనూహ్యంగా ఓటమిపాలైన దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​.. శనివారం భారత్​కు చేరుకుంది. వట్టి చేతులతో దేశానికి తిరిగిరావడం బాధాకరమని పేర్కొంది. ఈ క్రమంలో ఒలింపిక్స్​ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడింది.

MArykom
మేరీకోమ్​
author img

By

Published : Jul 31, 2021, 6:46 PM IST

టోక్యో ఒలింపిక్స్​ నుంచి దేశానికి వట్టి చేతులతో తిరిగివచ్చినందుకు బాధగా ఉందని తెలిపింది దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​. ప్రజల నుంచి తనకు చాలా మద్దతు లభించిందని.. కానీ పతకం గెలవలేకపోయినందుకు దేశానికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొంది. టోక్యో నుంచి భారత్​కు శనివారం చేరుకున్న మేరీకోమ్​.. దిల్లీ విమానాశ్రయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

"పతకం తీసుకురాకుండా వెనక్కి వచ్చినందుకు బాధగా ఉంది. మెడల్​తో ఇండియాకు వద్దామనుకున్నా. నాకు ప్రజల మద్దతు లభించింది. ఆ మ్యాచ్​లో(రౌండ్​ 16) నేను మొదటి రెండు రౌండ్లు గెలిచా. అయినా నేను ఓడిపోయానని ప్రకటించారు. మరి నేను ఎలా ఓడిపోయినట్టు? ఇది మోసపూరిత నిర్ణయం. ఫలితాన్ని తారుమారు చేశారు. దేశానికి క్షమాపణలు చేప్పాలనుకుంటున్నా."

-మేరీకోమ్​, దిగ్గజ బాక్సర్​.

దేశానికి కచ్చితంగా పతకం తీసుకొస్తుందనుకున్న మేరీకోమ్​.. మహిళల 51 కేజీల విభాగంలో కొలంబియా బాక్సర్​ వాలెన్సియాతో జరిగిన పోరులో 2-3 తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది.

బౌట్​కు కొద్ది నిమిషాల ముందు జెర్సీ మార్చుకోవాలని అధికారులు తనకు చెప్పినట్టు మేరీకోమ్​ తెలిపింది. అంతకుముందు మ్యాచ్​లో అదే జెర్సీతో బరిలో దిగినప్పుడు ఎవరూ ఏమీ అనలేదని.. ఆ మ్యాచ్​లోనే ఎందుకు ఆదేశాలిచ్చారని ప్రశ్నించింది మేరీకోమ్​. ఇలా మరే దేశానికీ జరగలేదని పేర్కొంది. ఇది కచ్చితంగా మానసిక క్షోభకు గురిచేయడమేనని మండిపడింది.

తదుపరి మ్యాచ్​లపై ఓ రిపోర్టర్​ అడిగిన ప్రశ్నకు.. 'కచ్చితంగా ఆడతాను.. ఎందుకు ఆడకూడదు? నాకు వయసు ఉంది. 40 వరకు ఆడగలను' అని జవాబిచ్చింది సీనియర్​ క్రీడాకారిణి.

ఇదీ చూడండి:- Tokyo Olympics: సెమీస్​లో సింధు ఓటమి.. స్వర్ణం ఆశలు ఆవిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.