టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తృటిలో పతకం చేజారింది. గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో 4వ స్థానంలో నిలిచింది గోల్ఫర్ అదితి అశోక్. ఈ విభాగంలో.. అమెరికా గోల్ఫర్ నెల్లీ కొర్డా స్వర్ణం సాధించింది.
ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలవడంపై సంతోషంగా లేనని అదితి తెలిపింది.
"ఈ ఈవెంట్లో 4వ స్థానంలో నిలిచాను. వేరే ఎక్కడైనా 4వ స్థానంతో ఆనందిస్తాను. కానీ ఇది ఒలింపిక్స్. 4వ స్థానంతో ఆనందంగా ఉండటం కష్టం. నేను బాగా ఆడాను. నా 100శాతం ఇచ్చాను. పతకం వచ్చి ఉంటే ఆనందంగా ఉండేది. కానీ నా ప్రదర్శనతో అందరు సంతోషంగా ఉంటారని భావిస్తున్నా. గోల్ఫ్‌పై ప్రజలకు ఆసక్తి కలుగుతుందని ఆశిస్తున్నా."
-- అదితి అశోక్, భారత గోల్ఫర్.
పతకం దక్కకపోయినా.. తన అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల చూపును అకట్టుకుంది అదితి. 23ఏళ్ల అదితికి.. 2020లో అర్జున అవార్డు వరించింది. ఇక ఒలింపిక్స్‌లో అదితి ప్రదర్శనతో భారత్‌లో గోల్ఫ్‌కు ఆదరణ పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదితిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అద్భుత ప్రదర్శన అదితి అశోక్! మరో భారత ఆడబిడ్డ తన ముద్ర వేసింది. ఈ రోజు నీ చారిత్రక ప్రదర్శనతో భారత గోల్ఫ్‌ని కొత్త స్థాయికి తీసుకెళ్లావు. చాలా ప్రశాంతంగా, నిలకడగా ఆడావు. నీ నైపుణ్యం, శ్రమకు అభినందనలు.
--- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి.
అదితి.. అద్భుత ప్రదర్శన! టోక్యో ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభను చూపించాను. పతకం తృటిలో చేజారినప్పటికీ, ఏ భారతీయుడు సాధించని ఘనత సాధించావు. నీ భవిష్యత్తు కార్యచరణకు శుభాకాంక్షలు.
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి:- 'అదితి వల్ల ఇండియా గోల్ఫ్ నేర్చుకుంటుంది'