ఏ గురువైనా తన శిష్యులు.. గొప్పగా ఏదైనా సాధిస్తే ఎంతో మురిసిపోతారు. అలాంటిది ప్రపంచం స్థాయి ప్లేయర్లతో పోటీ పడి గెలిస్తే ఆ గురువుకు ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనే టోక్యో ఒలింపిక్స్‌లో కనిపించింది. తన శిష్యురాలు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో సదరు కోచ్ ఆనందం పట్టలేక, తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు.
అసలేమైందంటే..?
ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ ఆరియార్నె టిట్మస్.. టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు వందల మీటర్ల రిలే స్విమ్మింగ్ ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. తన శిష్యురాలు అరియార్నె విజయం సాధించిందని తెలియగానే, కోచ్ డీన్ బాక్సాల్ తెగ సంతోషపడిపోయాడు. ఆనందం పట్టలేక.. స్టాండ్స్‌లో చిందులు వేశాడు. గట్టిగట్టిగా అరుస్తూ.. సక్సెస్‌ను ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు!
-
Aussie Ariarne Titmus’s coach Dean Boxall after she beat queen of the pool Katy Ledecky in the 400 free today. Not see @massivemel do that 👀 but I bet she was inside 😂😢 well done Mel, TEAM 👏🏻👏🏻 pic.twitter.com/ecZkJWejR4
— Sharron Davies MBE (@sharrond62) July 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Aussie Ariarne Titmus’s coach Dean Boxall after she beat queen of the pool Katy Ledecky in the 400 free today. Not see @massivemel do that 👀 but I bet she was inside 😂😢 well done Mel, TEAM 👏🏻👏🏻 pic.twitter.com/ecZkJWejR4
— Sharron Davies MBE (@sharrond62) July 26, 2021Aussie Ariarne Titmus’s coach Dean Boxall after she beat queen of the pool Katy Ledecky in the 400 free today. Not see @massivemel do that 👀 but I bet she was inside 😂😢 well done Mel, TEAM 👏🏻👏🏻 pic.twitter.com/ecZkJWejR4
— Sharron Davies MBE (@sharrond62) July 26, 2021
డీన్ బాక్సాల్ చిందులు వేస్తున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బాక్సాల్ 2019 సంవత్సరానికిగానూ ఆస్ట్రేలియాలో 'కోచ్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాన్ని గెలుచుకోవడం విశేషం.
ఇవీ చూడండి: