ETV Bharat / sports

బాక్సింగ్​ సెమీస్​లో లవ్లీనా- భారత్​కు మరో మెడల్​ ఖాయం - indian boxer

Lovlina BORGOHAIN
లవ్లీనా బోర్గోహైన్​
author img

By

Published : Jul 30, 2021, 9:09 AM IST

Updated : Jul 30, 2021, 12:47 PM IST

09:06 July 30

బాక్సింగ్​ సెమీస్​లో లవ్లీనా- భారత్​కు మరో మెడల్​ ఖాయం

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు మరో మెడల్​ ఖాయమైంది. బాక్సింగ్​ మహిళల వెల్టర్​ వెయిట్​(69 కేజీలు) విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది లవ్లీనా బోర్గోహైన్​​. క్వార్టర్స్​లో చైనీస్​ తైపీ బాక్సర్​పై 4-1 తేడాతో గెలిచింది. 

ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో.. టర్కీ బాక్సర్​ సుర్మేనేలి బుసానాజ్​తో తలపడనుంది లవ్లీనా. అందులో గెలిస్తే.. ఫైనల్​కు చేరుతుంది. ఓడినా.. ఆమెకు కాంస్యం దక్కుతుంది. అయితే మ్యాచ్​ అనంతరం మాట్లాడిన లవ్లీనా.. బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఉన్నది ఒకటే మెడల్​ అని.. అది గోల్డేనని చెప్పింది. ప్రస్తుతం సెమీఫైనల్​ కోసం సాధన చేస్తానని స్పష్టం చేసింది. 

కాంస్యం ఇద్దరికి..

బాక్సింగ్​లో ఫైనల్లో గెలిచిన వారికి బంగారు పతకం, రన్నరప్​కు రజతం ఇస్తారు. సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్యం దక్కుతుంది.

భారత్​కు ఇప్పటికే ఈ ఒలింపిక్స్​లో ఓ రజత పతకం వచ్చింది. మహిళల వెయిట్​ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను.. రెండో స్థానంలో నిలిచి సిల్వర్​ మెడల్​ సాధించింది.  

తొలిసారే అయినా..

23ఏళ్ల లవ్లీనా ఒలింపిక్స్‌లో ఆడటం ఇదే తొలిసారి. క్వార్టర్స్‌లో ప్రత్యర్థి.. ప్రపంచ మాజీ ఛాంపియన్‌ అయినప్పటికీ ఈ యువ బాక్సర్‌ ఏ మాత్రం బెదరలేదు. తొలి రౌండ్‌ నుంచే దూకుడుగా పంచ్‌లు విసిరింది. అయితే ప్రత్యర్థి కూడా అంతే దీటుగా ఆడింది. ముగ్గురు న్యాయమూర్తులు లవ్లీనాకు ఓటు వేయడంతో 3-2తో తొలి రౌండ్‌ను గెలుచుకుంది. రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడి 5-0తో బౌట్‌ ముగించింది. మూడో రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ పోరులో 30-27, 29-28, 28-29, 30-27, 30-27తో లవ్లీనా ఘన విజయం అందుకుంది. 

చరిత్ర సృష్టించిన లవ్లీనా..

ఒలింపిక్‌ క్రీడల్లో బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం అందిస్తున్న మూడో బాక్సర్‌ లవ్లీనానే కావడం విశేషం. అంతకుముందు 2008లో విజేందర్‌ సింగ్‌, 2012లో మేరీ కోమ్‌ ఒలింపిక్‌ పతకం సాధించారు. వీరిద్దరికీ కాంస్యాలే దక్కాయి. అంతేగాక, బాక్సింగ్‌లో 69 కేజీల విభాగంలో భారత్‌కు తొలి ఒలింపిక్‌ పతకం అందిస్తున్నది కూడా లవ్లీనానే. ఈమె గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్య పతకాలు గెలిచింది. 

ప్రముఖుల ప్రశంసలు..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం ఖాయమవడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. యువ బాక్సర్‌ లవ్లీనాపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకుర్​, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు ట్విట్టర్‌ వేదికగా ఆమెను కొనియాడారు. 

ఇదీ చూడండి: 21వ ప్రయత్నంలో లంక సక్సెస్​- భారత్​ వరుస విజయాలకు బ్రేక్​

Last Updated : Jul 30, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.