ETV Bharat / sports

Tokyo Olympics: కష్టాల కడలి దాటి.. పతకాలను ముద్దాడి! - టోక్యో ఒలింపిక్స్​

వారి కథలు వేరు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే.. ఒలింపిక్స్​లో పతకం. ఇందుకోసం కష్టాలు దాటి.. పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అందరిలో స్ఫూర్తినింపారు. ఈ టోక్యో ఒలింపిక్స్​లో తమ ప్రతిభతో వారి దేశానికే పేరు తెచ్చిన కొందరు క్రీడాకారుల మీద ప్రత్యేక కథనం మీకోసం..

olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Aug 9, 2021, 7:16 AM IST

తల్లయ్యాక పరుగులో సత్తా చాటిన ఓ అమ్మ.. వివక్ష నుంచి ఒలింపిక్స్​ పోడియానికి చేరిన ఓ నల్ల జాతీయురాలు.. కరోనాపై పోరాటంలో రోగులకు సేవ చేస్తూ వైరస్​ బారిన పడినా.. కోలుకుని పతకం గెలిచిన ఓ నర్సు.. ఇలా ఎంతోమంది కష్టాల కడలిని దాటి టోక్యోలో విజేతలుగా నిలిచారు. పరిస్థితులు వెనక్కి లాగాలని చూసినా.. సవాళ్లతో సావాసం చేసి.. అడ్డంకులను అధిగమించి ఛాంపియన్లుగా మారారు. సమస్యలు వచ్చాయని ఆగిపోతే చరిత్ర సృష్టించాలేమని నమ్మి.. పోరాటమే మార్గంగా ముందుకు సాగి తమ దేశాలకు పతక వెలుగులు పంచిన ఈ అథ్లెట్ల ప్రయాణం స్ఫూర్తిదాయకం.

అద్భుతాలు చేసే అమ్మ..

18 ఏళ్ల ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ మహిళల 200మీ. పరుగులో ఓ అమ్మాయి రజతం గెలిచింది. అందులో ఏం ప్రత్యేకత లేదనిపించొచ్చు. కానీ అదే అమ్మాయి.. అమ్మగా మారిన తర్వాత 35 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌ పరుగులో ఓ పసిడి, కాంస్యం నెగ్గితే.. అద్భుతమే కదా! టోక్యోలో అమెరికా అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ సాధించిందదే. వరుసగా అయిదో ఒలింపిక్స్‌ బరిలో దిగిన ఆమె.. 4×400మీ.రిలేలో పసిడి, 400మీ. పరుగులో కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు (11) సాధించిన మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2018లో నెలలు నిండకముందే ఆడ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. తన పాపతో పాటు నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యంగా ఇళ్లు చేరిన ఆమె.. తిరిగి ట్రాక్‌పై అడుగుపెట్టడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ సంకల్ప బలంతో అడుగేసిన ఆమె ఇప్పుడు రికార్డుల్లోకి ఎక్కింది.

olympics
అలిసన్​ ఫెలిక్స్​

ఏడో స్వర్ణంతో వీడ్కోలు..

నీటిలో ఆమె దిగిదంటే పసిడి ఖాయమే. డ్యూయెట్‌ అయినా.. టీమ్‌ విభాగమైనా ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌లో ఆమెకు తిరుగులేదు. మూడేళ్ల పాపకు అమ్మగా టోక్యోలో అడుగుపెట్టినప్పటికీ ఆమె జోరు తగ్గలేదు. ఈ క్రీడల్లో రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం నాలుగు ఒలింపిక్స్‌ల్లో ఏడు బంగారు పతకాలు సాధించిన ఆమె ఆటకు వీడ్కోలు పలికింది. ఆమే.. రష్యా స్విమ్మర్‌ స్వెత్లానా. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి పోటీపడ్డ ప్రతి విభాగంలోనూ ఆమె పసిడి నెగ్గడం విశేషం.

olympics
స్వెత్లానా

స్నేహం కోసం..

ఒలింపిక్స్‌ పతకం సాధించాలన్నది ప్రతి ఒక్క అథ్లెట్‌ కల. అందులోనూ పసిడి దక్కితే ఆ ఆనందమే వేరు. ఈ సారి టోక్యోలో ఒకే క్రీడాంశంలో ఇద్దరు అథ్లెట్లు ఆ సంతోషాన్ని పొందారు. అథ్లెట్ల మధ్య ఉండే పోటీని దాటి ఈ స్నేహితులు స్ఫూర్తిని పంచారు. పురుషుల హైజంప్‌లో తాంబెరి (ఇటలీ), బార్షిమ్‌ (ఖతార్‌) తమ తొలి ప్రయత్నాల్లో 2.37 మీటర్ల దూరం దూకారు. ఆ తర్వాత ఇద్దరిలో ఏ ఒక్కరూ అంతకుమించిన ప్రదర్శన చేయలేకపోయారు. విజేతను తేల్చేందుకు జంపాఫ్‌ నిర్వహించాలని నిర్వహకులు అనుకున్నారు. కానీ తాము పసిడి పంచుకుంటామని, ఇద్దరికీ స్వర్ణాలు ఇవ్వాలని బార్షిమ్‌ అడగడం వల్ల నిర్వాహకులు అందుకు ఒప్పుకొన్నారు. నిబంధనల ప్రకారం జంపాఫ్‌కు అథ్లెట్లు ఒప్పుకోకపోతే ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించవచ్చు. దీంతో సంతోషం పట్టలేని తంబేరి.. పరుగెత్తుతూ వచ్చి ఒక్కసారిగా ఎగిరి బర్శిమ్‌ కౌగిలిలో ఒదిగిపోయాడు. 11 ఏళ్ల నుంచి మంచి మిత్రులైన వీళ్లిద్దరూ పసిడి పంచుకోవడం ఒలింపిక్స్‌కే హైలైట్‌గా నిలిచింది.

olympics
తాంబెరి, బర్షిమ్​

నాన్న కోసం..

పాఠశాల స్థాయి రెజ్లింగ్‌ మ్యాచ్‌లో తన కూతురు పోటీపడుతుంటే చూడాలని ఆ తండ్రి వెళ్లాడు. మ్యాచ్‌ అయిపోయాక తిరిగి కార్లో ఇంటికి వెళ్తున్నాడు. కానీ అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తన రెజ్లింగ్‌ కారణంగానే తండ్రి మరణించాడని భావించిన ఆ అమ్మాయి.. కొన్నేళ్ల పాటు ఆటకు దూరంగా ఉంది. కానీ రెజ్లింగ్‌లో ఛాంపియన్‌గా నిలవాలనే ఆయన కలను నిజం చేసేందుకు తిరిగి మ్యాట్‌పై అడుగుపెట్టింది. ఇప్పుడు ఒలింపిక్స్‌ పసిడి పతకాన్ని అందుకుంది. ఆమే.. అమెరికా రెజ్లర్‌ మెన్సా స్టాక్‌. టోక్యోలో మహిళల 68 కేజీల స్వర్ణం గెలిచి ఆ ఘనత అందుకున్న తొలి అమెరికా నల్లజాతీయురాలిగా నిలిచింది. జాత్యహంకారం ఎక్కువగా ఉండే అమెరికా లాంటి దేశం నుంచి వచ్చి.. తన తండ్రి మరణాన్ని దిగమింగి.. ఇప్పుడు ఒలింపిక్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె ప్రయాణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

olympics
మెన్సా స్టాక్​

మానసిక సమస్యను దాటి..

టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అగ్రశ్రేణి అమెరికా జిమ్నాస్ట్‌ బైల్స్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. రియోలో నాలుగు స్వర్ణాలు గెలిచిన ఆమె.. ఈసారి ఆరు విభాగాల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కానీ టీమ్‌ ఫైనల్స్‌ సమయంలో 'ట్విస్టీస్‌' అనే మానసిక సమస్యతో మధ్యలోనే తప్పుకొంది. దీంతో ఆ విభాగంలో అమెరికా రజతానికే పరిమితమైంది. ఆ తర్వాత నాలుగు వ్యక్తిగత ఫైనల్స్‌కూ ఆమె దూరమైంది. ఇక ఈ ఒలింపిక్స్‌లో తనను చూడలేమనుకుంటే.. బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్లో బరిలో దిగి కాంస్యం సాధించింది. తన స్థాయికి కాంస్యం తక్కువే కాని.. సమస్యను దాటి సాధించిన ఈ పతకానికి ఎంతో విలువ.

olympics
బైల్స్​

ఆ కల తీర్చారు..

విశ్వ క్రీడల్లో తమ దేశాలకు తొలి స్వర్ణాన్ని అందించి.. తమ కలతో పాటు దేశ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు.. ఈ ఇద్దరు అమ్మాయిలు. మహిళల 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఛాంపియన్‌గా నిలచిన హిడిలిన్‌ డియాజ్‌.. ఒలింపిక్స్‌ చరిత్రలోనే ఫిలిప్పిన్స్‌కు తొలి బంగారు పతకాన్ని కట్టబెట్టిన అథ్లెట్‌గా నిలిచింది. తన కూతురిని ఛాంపియన్‌గా చూడాలని తపన పడ్డ రిక్షా నడిపే తన తండ్రి కలను ఆమె నిజం చేసింది. మరోవైపు బెర్ముడా ట్రయథ్లాన్‌ అథ్లెట్‌ ఫ్లోరా డఫ్పీ తన దేశంలోని దాదాపు 63 వేల మంది ప్రజల ఆకాంక్షలను నిజం చేసింది. స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, పరుగును అందరికంటే ముందుగా పూర్తి చేసిన ఆమె దేశానికి తొలి స్వర్ణాన్ని అందించింది.

olympics
హిడిలిన్​ డియాజ్​

నర్సు మెడలో పసిడి

ఇరాన్‌ షూటర్‌ జావద్‌ ఫోరోఘి.. గుండె సమస్యతోనే పుట్టాడు. ఆ తర్వాత కొన్నేళ్లు సిరియాలోని యుద్ధ భూమిలో గడిపాడు. కరోనాపై పోరాటంలో భాగంగా ఓ నర్సుగా ఆసుపత్రిలో సేవలందించాడు. వైరస్‌ బారిన పడ్డాడు. ఇప్పుడు టోక్యోలో పురుషుల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో స్వర్ణంతో దేశానికి షూటింగ్‌లో తొలి ఒలింపిక్స్‌ పతకాన్ని అందించాడు. ఇరాన్‌ సాయుధ దళాల్లోని ఓ శాఖ అయిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌లో భాగంగా సిరియాలో 2012- 13 మధ్యలో నర్సుగా పని చేశాడు. కరోనా సమయంలోనూ తీరిక లేకుండా పనిచేసిన అతను.. చివరకు దాని బారినే పడ్డాడు. వైరస్‌ నుంచి కోలుకుని 41 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌ పతకం సాధించాడు.

olympics
జావ్​ ఫొరోఘి

58 ఏళ్ల వయసులో..

50 ఏళ్లు పైబడ్డాక చాలా మందిలో దృష్టి మందగిస్తుంది. అలాంటిది 58 ఏళ్ల వయసులో కంటి చూపే ప్రధానమైన షూటింగ్‌లో కాంస్యం గెలిచి ఔరా అనిపించాడు.. కువైట్‌ షూటర్‌ అబ్దుల్లా అల్‌ రషీది. 1996 నుంచి ప్రతి ఒలింపిక్స్‌లోనూ పోటీపడుతోన్న అతను.. టోక్యోలో స్కీట్‌లో పతకం నెగ్గాడు. రియోలోనూ అతను కాంస్యం గెలిచినప్పటికీ అప్పుడు ఆటల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఒలింపిక్స్‌లో పోటీపడకుండా కువైట్‌పై నిషేధం పడడం పల్ల.. స్వతంత్ర అథ్లెట్‌గా బరిలో దిగాడు. ఇప్పుడు దేశానికి అధికారికంగా పతకం అందించాడు. ఓటమితో నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని వరుసగా ఏడు సార్లు ఒలింపిక్స్‌ల్లో పోటీపడ్డ అతను చెబుతున్నాడు.

olympics
అబ్దుల్లా అల్​ రషీది

పార్ట్‌టైమ్‌ క్లీనర్‌..

ఐర్లాండ్‌ బాక్సర్‌ కెల్లీ హారింగ్టన్‌ది మరో స్ఫూర్తి గాథ. డబ్లిన్‌లోని ఓ ఆసుపత్రిలో పార్ట్‌టైమ్‌ క్లీనర్‌గా పని చేసిన ఆమె టోక్యోలో ఏకంగా పసిడి ముద్దాడింది. మహిళల 60 కేజీల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. తన నగరంలో బాక్సింగ్‌ క్లబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె కూడా టీనేజీలోనే పంచ్‌లు విసరడం మొదలెట్టింది. పూర్తిగా బాక్సింగ్‌ మీదే ధ్యాస పెట్టింది. 2018లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ 31 ఏళ్ల బాక్సర్‌.. మొదట్లో డబ్బుల కోసం పార్ట్‌టైమ్‌ క్లీనర్‌గా పనిచేసింది. ఓ వైపు రింగ్‌లో సాధన కొనసాగిస్తూనే.. మరోవైపు ఆసుపత్రికి పనికి వెళ్లేది. చుట్టుపక్కల వాళ్లతో ఎంతో సన్నిహితంగా ఉండే ఆమె.. ఇప్పుడు సాధించిన ఒలింపిక్‌ స్వర్ణం పట్ల వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఆమె విజయం ఎంతో మందికి ప్రేరణే.

olympics
కెల్లీ హారింగ్టన్​

ఇదీ చూడండి:- Olympics 2020: రికార్డులు కొల్లగొట్టి.. పతకాలు ఒడిసిపట్టి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.