ఒలింపిక్స్ పతకం కోసం ఏళ్ల కష్టాన్ని పెట్టుబడిగా పెడతారు క్రీడాకారులు. ఆ ఎదురుచూపులకు ఆశించిన ఫలితం దక్కకపోతే.. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు. అర్జెంటీనాకు చెందిన మారియా బెలెన్ పెరెజ్ మారైస్ అనే ఫెన్సింగ్ క్రీడాకారిణికి సోమవారం టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ఆశలు చెదిరిపోయాయి. కానీ ఆమె కోచ్ మాత్రం ఈ రోజును ఆమెకు ప్రత్యేకంగా మార్చారు. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగి తోడుగా నిలిచారు.
మారియా, ఆమె కోచ్ లుకాస్ గిల్లెర్మో సాసిడో ఎన్నోఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. సాసిడో ఆమెను పెళ్లిచేసుకోవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నారు. 2010లో కూడా ఒకసారి మారియా ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచగా.. ఆమె తిరస్కరించారని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఇన్నేళ్లకు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ వేదికగా ఆయన మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు. ఈసారి మాత్రం ఆయనకు 'ఎస్' అనే సమాధానం వినిపించింది. దాంతో ఆ కోచ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
-
Y después del combate de esgrima le pidieron casamiento a María Belén Pérez Maurice en vivo. pic.twitter.com/wEmGuOW7CB
— Rústico (@lautarojl) July 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Y después del combate de esgrima le pidieron casamiento a María Belén Pérez Maurice en vivo. pic.twitter.com/wEmGuOW7CB
— Rústico (@lautarojl) July 26, 2021Y después del combate de esgrima le pidieron casamiento a María Belén Pérez Maurice en vivo. pic.twitter.com/wEmGuOW7CB
— Rústico (@lautarojl) July 26, 2021
హంగరీకి చెందిన ఫెన్సర్ చేతిలో మారియా 15-12 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ పెళ్లి ప్రస్తావనతో ఆ బాధనంతా మర్చిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 'నేను ఎస్ చెప్పాను' అంటూ చిరునవ్వులు చిందించారు. దీని గురించి సాసిడో మాట్లాడుతూ.. 'ఈ రోజు ఎలాగైనా ఆమెకు నా మనసులో మాట చెప్పేయాలనుకున్నా. అందుకోసం ముందుగానే సిద్ధమయ్యా' అంటూ వెల్లడించారు. అయితే ఒలింపిక్ గ్రామంలో ఉన్న నిబంధనల దృష్ట్యా ఈ జంట తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది.
ఇదీ చూడండి.. ఇంటికి చేరిన మీరా.. మణిపూర్లో ఘన స్వాగతం