అఫ్గానిస్థాన్‌కు చెందిన ఇద్దరు పారాలింపిక్(Tokyo Paralympics) అథ్లెట్లు క్షేమంగా ఆ దేశ సరిహద్దు దాటారని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ(ఐపీసీ) వెల్లడించింది. ఈ క్రీడల్లో వారు పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. అయితే కమిటీ వారిద్దరి ఆచూకీని మాత్రం బహిర్గతం చేయలేదు.
"ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. పారాలింపిక్స్ ఆరంభోత్సవంలో అఫ్గానిస్థాన్ జెండాను సంఘీభావంగా ప్రదర్శించాం. ఆ దేశానికి చెందిన ఇద్దరు పారా అథ్లెట్లు.. అఫ్గాన్ సరిహద్దులు దాటి బయటకు వచ్చారు. వారిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు".
- క్రెయిగ్ స్పెన్స్, ఐపీసీ అధికార ప్రతినిధి
"ప్రస్తుతం వారిద్దరు క్రీడల్లో పాల్గొనే దానికి ముందు వారి ఆరోగ్యానికి ప్రాధ్యాన్యమివ్వడం ప్రాథమిక బాధ్యత. ఇదే విషయమై కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేస్తున్నాం. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడం ముఖ్య"మని క్రెయిన్(Craig Spence) అన్నారు.
అఫ్గానిస్థాన్‌కు చెందిన మహిళా అథ్లెట్ జాకియా ఖుదాదాదితో(Zakia Khudadadi) పాటు మరో క్రీడాకారుడు హుస్సేన్ రసౌలి(Hossain Rasouli).. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో పాల్గొనాల్సిఉంది. అయితే ఆ దేశ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించిన కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలకు ఆటంకం కలిగింది. దీంతో జాకియా ఖుదాదాది ఓ మీడియాసంస్థతో మాట్లాడుతూ.. తన దేశం తరఫున పారాలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. దాని కోసం ఆమె ప్రపంచదేశాల సాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె అఫ్గానిస్థాన్ నుంచి బయటకు రావడం వల్ల విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయమై అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ అధికార ప్రతినిధి క్రెయిగ్ స్పెన్స్ స్పష్టత ఇచ్చారు.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు అక్రమించుకున్న(Taliban's takeover) తర్వాత అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. దీంతో పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు అథ్లెట్లకు ప్రయాణించే అవకాశం లేకపోయింది. దీంతో ఆ దేశ క్రీడాకారులు విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశం లేదని అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ అంతకుముందు వెల్లడించింది.
ఇదీ చూడండి.. సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్థానీ అభిమాని