ETV Bharat / sports

Wimbledon: వింబుల్డన్​కు ఎంపికైన తొలి చైనా ఆటగాడు - టెన్నిస్ న్యూస్

త్వరలో ప్రారంభమయ్యే వింబుల్డన్​ నుంచి స్టార్ ప్లేయర్ డొమ్​నిక్ థీమ్ తప్పుకొన్నాడు. అలానే ఈ టోర్నీకి అర్హత సాధించిన చైనా తొలి ఆటగాడిగా జాంగ్ జిజెన్ నిలిచాడు.

Zhang Zhizhen 1st Chinese man in Wimbledon draw
జాంగ్ జిజెన్
author img

By

Published : Jun 25, 2021, 1:54 PM IST

వింబుల్డన్​కు అంతా సిద్ధమైంది. సోమవారం నుంచి లండన్​ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. అయితే దీని మెయిన్ డ్రాకు ఎంపికైన టెన్నిస్ ప్లేయర్​ జాంగ్ జిజెన్.. అరుదైన ఘనత సాధించాడు. చైనా నుంచి ఈ టోర్నీకి అర్హత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు​.

క్వాలిఫయర్స్​లో మూడు మ్యాచ్​ల్లో విజయం సాధించి, మెయిన్​ డ్రాకు అర్హత సాధించాడు జాంగ్. 24 ఏళ్ల ఈ కుర్రాడు.. ప్రస్తుతం 178 ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇంతకు ముందు కూడా మూడుసార్లు వింబుల్డన్​ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.

అంతకు ముందు చెనాకు చెందిన మహిళా ప్లేయర్ లినా. ఈమె 2011 ఫ్రెంచ్​ ఓపెన్, 2014 ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచింది. 2019లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్​లో చోటు దక్కించుకుంది.

వింబుల్డన్ నుంచి స్టార్ ప్లేయర్ నిష్క్రమణ

యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్​ డొమ్​నిక్ థీమ్.. వింబుల్డన్​ నుంచి తప్పుకున్నాడు. కుడి మోచేతి గాయమే ఇందుకు కారణమని వెల్లడించాడు.

ఇది చదవండి: OLYMPICS: టోక్యో ఒలింపిక్స్​తో సానియా రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.