ETV Bharat / sports

కరోనా టీకాకు నేను వ్యతిరేకం: జకోవిచ్

author img

By

Published : Apr 20, 2020, 11:56 AM IST

కరోనా టీకాకు తాను వ్యతిరేకమని తెలిపాడు టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్. వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయమని అన్నాడు.

జకోవిచ్
జకోవిచ్

కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు కూడా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ టీకాకు తాను వ్యతిరేకం అంటున్నాడు టెన్నిస్ ఆటగాడు జకోవిచ్. టెన్నిస్ ప్లేయర్లు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్న మహిళా టెన్నిస్ మాజీ నెంబర్​వన్ ఎమెలీ మోరెస్మో సూచనను అతడు వ్యతిరేకించాడు.

"నేనైతే వ్యక్తిగతంగా కరోనా టీకాకు వ్యతిరేకం. ఈ విషయంలో ఎవర్నీ బలవంతం చేయవలసిన అవసరం లేదు. కరోనా టీకాను తప్పనిసరి చేస్తే ఏమౌతుంది. ఏ పని అయినా చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు అనేవి ఉంటాయి. ఇక్కడ నేనే నిర్ణయం తీసుకోవాలి. నా ఆలోచనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. సమయాన్ని బట్టి ఆలోచనలు మారతాయి."

-జకోవిచ్, టెన్నిస్ ఆటగాడు

తాజాగా టెన్నిస్‌ ర్యాంకుల్లో దిగువ స్థాయిలో ఉన్న ఆటగాళ్లను ఆదుకోవాలని 'బిగ్‌-3' రోజర్‌ ఫెదరర్‌, నొవాక్‌ జకోవిచ్‌, రఫెల్‌ నాదల్‌ నిర్ణయించారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్‌ ఆగిపోవడం వల్ల యువ క్రీడాకారుల్లో నిరాశ అలుముకుంది. ఈ నేపథ్యంలో వారిని ఆర్థికంగా ఆదుకోవాలనేది 'బిగ్‌-3' ఆలోచన.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.