ETV Bharat / sports

వింబుల్డన్​ విన్నర్​​.. గతంలో క్రికెటర్​ అని తెలుసా?​

వింబుల్డన్​ మహిళల టైటిల్ గెలుచుకున్న ఆష్లే బార్టీ(Ashleigh Barty).. గతంలో క్రికెటర్​ అనే విషయం మీకు తెలుసా?. సుమారు రెండేళ్ల పాటు టెన్నిస్​కు దూరమైన బార్టీ.. ఆస్ట్రేలియా బిగ్​ బాష్​ లీగ్​లో కొనసాగింది.

Ashleigh Barty, tennis player
ఆష్లే బార్టీ, స్టార్​ టెన్నిస్ ప్లేయర్
author img

By

Published : Jul 11, 2021, 3:14 PM IST

వింబుల్డన్​ మహిళల సింగిల్స్​ టైటిల్​ను గెలుచుకుంది ఆస్ట్రేలియా స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ ఆష్లే బార్టీ. 2019లో ఫ్రెంచ్​ ఓపెన్​ విజయంతో కెరీర్​లో తొలి గ్రాండ్​స్లామ్​ను కైవసం చేసుకున్న బార్టీ.. తాజాగా రెండో ట్రోఫీని ముద్దాడింది. టెన్నిస్​లో నంబర్​వన్​గా ఉన్న బార్టీ​.. గతంలో క్రికెటర్​గానూ కొనసాగిందనే విషయం తెలుసా?

ఆస్ట్రేలియాకు చెందిన బార్టీ 2014లో టెన్నిస్​ నుంచి తప్పుకుంది. కొంతకాలం క్రికెట్​కు ప్రాతినిధ్యం వహించింది. ఈ క్రమంలో 2015లో మహిళల బిగ్​బాష్​ లీగ్​లో బ్రిస్బేన్​ హీట్​ జట్టుకు ఆడింది. అదే ఏడాది నవంబర్​లో క్వీన్​లాండ్స్​ జట్టు తరఫున కూడా రెండు లిస్ట్​-ఏ మ్యాచ్​ల్లో ఆడింది బార్టీ. మళ్లీ 2016లో రాకెట్​ చేత బట్టి కోర్టులోకి దిగింది.

ఇక శనివారం ప్లిస్కోవా (చెక్​)తో జరిగిన మహిళల సింగిల్స్​ ఫైనల్లో బార్టీ.. 6-3, 6-7 (4), 6-3 తేడాతో గెలుపొందింది. కెరీర్​లో తొలి వింబుల్డన్​ టైటిల్​ను ఖాతాలో వేసుకుంది.

ఇదీ చదవండి: Wimbledon: క్రొయేషియా జోడీకే వింబుల్డన్​ డబుల్స్​ ట్రోఫీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.