ETV Bharat / sports

Wimbledon: సెమీస్​లో బార్టీ.. ప్రీక్వార్టర్స్​లో మెద్వెదెవ్​కు షాక్​

వింబుల్డన్‌ కీలక ఘట్టానికి చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ బార్టీ, రెండో సీడ్‌ సబలెంక, ప్లిస్కోవా, కెర్బర్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల ప్రీక్వార్టర్స్‌లో అయిదో సీడ్‌ మెద్వెదెవ్‌కు హర్కజ్‌ షాకిచ్చాడు.

Ashleigh Barty, Wimbledon
ఆష్లే బార్టీ, వింబుల్డన్
author img

By

Published : Jul 7, 2021, 7:33 AM IST

టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆమె క్వార్టర్‌ఫైనల్లో 6-1, 6-3తో తొమ్లనోవిచ్‌ (ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించింది. బార్టీ 5 ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టింది. రెండో సీడ్‌ సబలెంక కూడా సెమీస్‌లో చోటు సంపాదించింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 6-4, 6-3తో జబేర్‌ (ట్యునీషియా)పై విజయం సాధించింది. సబలెంక 3 ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టింది. జబేర్‌ 4 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

మరో క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌) 6-2, 6-2తో అన్‌ సీడెడ్‌ విక్టోరియా గోల్బిచ్‌ (స్విట్జర్లాండ్‌)ను అలవోకగా ఓడించింది. ప్లిస్కోవా తన సర్వీసులో కేవలం 13 పాయింట్లు కోల్పోయింది. వింబుల్డన్‌ సెమీస్‌ చేరడం ఆమెకు ఇదే తొలిసారి. మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ) కూడా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆమె 6-2, 6-3తో ముచోవా (చెక్‌)పై విజయం సాధించింది. సెమీస్‌లో కెర్బర్‌తో బార్టీ, ప్లిస్కోవాతో సబలెంక తలపడతారు.

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మారథాన్‌ పోరులో 14వ సీడ్‌ హర్కజ్‌ (పోలెండ్‌) 2-6, 7-6 (7-2), 3-6, 6-3, 6-3తో అతడికి షాకిచ్చి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్‌లో హర్కజ్‌ 10 ఏస్‌లు, 47 విన్నర్లు కొట్టాడు. ఆరో సీడ్‌ ఫెదరర్‌ (స్విట్టర్లాండ్‌) 7-5, 6-4, 6-2తో సొనెగో (ఇటలీ)ను ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు.

ఇదీ చదవండి: Wimbledon: క్వార్టర్స్​లో ఫెదరర్.. అరుదైన రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.