ETV Bharat / sports

Wimbledon: మహిళల డబుల్స్ నుంచి అంకిత జోడీ ఔట్ - వింబుల్డన్ ఓపెన్

వింబుల్డన్ ఓపెన్​లో మహిళల డబుల్స్ జంట అంకితా రైనా-లారెన్ డేవిస్​కు పరాభవం ఎదురైంది. యూఎస్​ జంట అసియా మహమ్మద్​-జెస్సికా పెగులా ద్వయంతో జరిగిన పోటీలో 6-3, 6-2 తేడాతో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది.

ankita raina, lauren davis
అంకిత రైనా, లారెన్ డేవిస్
author img

By

Published : Jul 2, 2021, 1:46 PM IST

మహిళల డబుల్స్​ జోడీ అంకితా రైనా(ఇండియా)-లారెన్ డేవిస్(అమెరికా)​.. వింబుల్డన్​ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ టోర్నీలో తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న రైనాకు నిరాశే ఎదురైంది. యూఎస్ డబుల్స్​ జంట అసియా మహమ్మద్​-జెస్సికా పెగులా.. వరుస సెట్లలో ఈ ద్వయాన్ని ఓడించింది. గంటా పది నిమిషాల పాటు జరిగిన పోరులో అంకిత-డేవిస్ ద్వయం 6-3, 6-2 తేడాతో ఓటమి పాలైంది.

మిక్స్​డ్ డబుల్స్​ రూపంలో అంకితకు మరో అవకాశం ఉంది. భారత జోడీ సానియా మీర్జా-రోహన్​ బోపన్నపై అంకిత-రామ్​కుమార్ రామనాథన్​ జంట శుక్రవారం పోటీ పడనుంది.

అంతకుముందు జరిగిన డబుల్స్​ పోటీల్లో భారత స్టార్ ప్లేయర్​ సానియా జోడీ ముందడుగు వేసింది. తొలి రౌండ్​లో తన భాగస్వామి బెథానీ మాటెక్​తో కలిసి దెసైరే క్రాజిక్​(అమెరికా)-అలెక్సా గౌరాచి(చిలీ)పై 7-5, 6-3 తేడాతో విజయం సాధించింది.

ఇదీ చదవండి: Wimbledon: రెండో రౌండ్​కు సానియా ద్వయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.