నొవాక్ జకోవిచ్ అదరగొట్టాడు... ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ ప్రపంచ నంబర్‌వన్ వింబుల్డన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ జకో 7-6 (7/3), 7-5, 7-5తో డెన్నిస్ షపవ్‌లోవ్ (కెనడా)ను ఓడించాడు.
తొలి సెట్ ఆరంభంలోనే జకో సర్వీస్ బ్రేక్ చేసిన షపవ్‌లోవ్ ఒక దశలో 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ పుంజుకున్న నొవాక్ సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించాడు. టైబ్రేకర్‌లోనూ దూకుడుగా ఆడిన అతడు సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్లోనూ హోరాహోరీ పోరాటం జరిగింది. పదకొండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన జకో అదే జోరుతో సెట్ గెలిచాడు. మూడో సెట్.. రెండో సెట్‌ను తలపించింది.
మరో సెమీస్‌లో బెరిటిని (ఇటలీ) 6-3, 6-0, 6-7 (3/7), 6-4తో 14వ సీడ్ హుబర్ట్ హర్కాజ్ (పోలెండ్) సంచలనాలకు తెరదించాడు. క్వార్టర్స్‌లో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు షాకిచ్చిన హర్కాజ్.. ఆ జోరును ఈ మ్యాచ్‌లో చూపించలేపోయాడు. పోరు ఆరంభం నుంచే బెరిటిని దూకుడుగా ఆడాడు. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లకు తోడు బుల్లెట్ సర్వీసులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టిన బెరిటిని ఎక్కువగా కష్టపడకుండానే తొలి రెండు సెట్లను చేజిక్కించుకున్నాడు. 45 ఏళ్లలో ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన మొదటి ఇటలీ క్రీడాకారుడిగా బెరిటిని ఘనత సాధించాడు.
ఇదీ చూడండి: 'జులై 9న పుట్టిన ఆ లెజెండ్ ఎక్కడున్నాడో?'