వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో 6-3, 7-5, 6-3 తేడాతో కొచ్రీబర్(జర్మనీ)పై విజయం సాధించాడు.
మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆరోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ), ఏడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్(గ్రీస్)లకు షాక్ తగిలింది. జ్వెరెవ్ 6-4, 3-6, 2-6, 5-7తో వెస్లీ(చెక్) చేతిలో ఓడిపోయాడు. సిట్సిపాస్ 4-6, 6-3, 4-6, 10-6, 3-6తో ఫాబియానో(ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.
వావ్రింకా (స్విట్జర్లాండ్), అండర్సన్(దక్షిణాఫ్రికా), కచనోవ్(రష్యా), మెద్వెదెవ్(రష్యా), కార్లోవిచ్(క్రొయేషియా), తిప్సరెవిచ్(సెర్బియా), సెప్పి(ఇటలీ) తొలి రౌండ్ను అధిగమించారు.
పోరాడినా ఫలితం నిల్..
సింగిల్స్ మెయిన్ డ్రా బరిలో నిలిచిన ఏకైక భారతీయుడు ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. 15వ సీడ్ రోనిచ్తో చివరి వరకు పోరాడి పరాభవం చెందాడు. రోనిచ్ 7-6, 7-1, 6-4, 6-2తో ప్రజ్ఞేశ్పై విజయం సాధించాడు.