ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సెమీస్​లోకి సెరెనా, జకోవిచ్​

టెన్నిస్​ స్టార్​ ప్లేయర్లు​ సెరెనా విలియమ్స్​, జకోవిచ్​లు.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సెమీస్​లోకి అడుగుపెట్టారు. ప్రపంచ రెండో సీడ్​ సిమోనా హలెప్​పై సెరెనా గెలుపొందగా.. అలెగ్జాండర్​ జ్వరేవ్​పై నొవాక్​ జకోవిచ్​ విజయం సాధించాడు.

Watch | Australian Open: Serena Williams knocks Halep out, progresses to semis
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సెమీస్​లోకి సెరెనా, జకోవిచ్​
author img

By

Published : Feb 16, 2021, 6:35 PM IST

Updated : Feb 16, 2021, 9:18 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్లో సెరెనా విలియమ్స్​ మరో అడుగు ముందుకేసింది. క్వార్టర్​ ఫైనల్లో ప్రపంచ రెండో సీడ్ సిమోనా హలెప్​పై గెలుపొందింది. 6-3, 6-3 తేడాతో రొమేనియా ప్లేయర్​పై విజయం సాధించినా సెరెనా.. సెమీస్​లోకి దూసుకెళ్లింది. సెరెనా తన తొలి రౌండ్​లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-3తో చిత్తు చేసింది. రెండో రౌండ్​లో అనుహ్యంగా విజృంభించిన హలెప్​.. 3-1 ఆధిక్యం సంపాదించింది. తర్వాత సెరెనా 3-3తో స్కోరు సమం చేసింది.

2017లో ఆస్ట్రేలియన్​ ఓపెన్​ గెలుపొందిన తర్వాత మళ్లీ సెమీస్​లోకి వెళ్లడం ఈ అమెరికన్​ టెన్నిస్​​ ప్లేయర్​కు ఇదే మొదటిసారి. 24వ గ్రాండ్​స్లామ్​ టైటిల్​ సాధించాలన్న సెరెనా ఆశలకు తాజా విజయం ఊపిరిలూదింది.

జకోవిచ్​..

పురుషుల సింగిల్స్​ క్వార్టర్స్​లో.. జర్మనీ ప్లేయర్​ అలెగ్జాండర్​ జ్వెరెవ్​పై సెర్బియా టెన్నిస్​ స్టార్​ ఆటగాడు నొవాక్ జకోవిచ్​ గెలుపొందాడు. 6-7, 6-2, 6-4, 7-6 తేడాతో ప్రత్యర్థిని ఓడించి సెమీస్​లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో జ్వెరెవ్​ ముందడుగు వేసినా.. తదుపరి మూడు రౌండ్లలో నొవాక్ ఆధిక్యం సాధించాడు.​

అంతకుముందు జరిగిన మ్యాచ్​లో ప్రపంచ 114వ ర్యాంకర్​ అస్లాన్​ కరాత్సెవ్ సెమీస్​లోకి దూసుకెళ్లాడు. 14వ సీడ్​ ఆటగాడు గ్రిగోర్​ డిమిత్రోవ్​ను 2-6, 6-4, 6-1, 6-2 తేడాతో చిత్తు చేశాడు. గ్రాండ్​స్లామ్​లో తొలిసారి పాల్గొని సెమీస్​కు అర్హత సాధించిన ఆటగాడిగా కరాత్సెవ్​ రికార్డు సృష్టించాడు. ఇతడు తన తదుపరి మ్యాచ్​లో నొవాక్​ జకోవిచ్​ను ఢీకొనబోతున్నాడు.

ఇదీ చదవండి: ఈ ఓటమి మాకొక గుణపాఠం: రూట్​

Last Updated : Feb 16, 2021, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.