సెర్బియా ఆటగాడు డుసాన్ లాజోవిక్తో తలపడిన నిక్.... అండర్ ఆర్మ్ షాట్ ఆడాడు. ఈ మ్యాచ్లో కిర్గియోస్ 6-3, 6-1 తేడాతో విజయం సాధించాడు. నిక్ గెలిచినప్పటికీ క్రీడాస్ఫూర్తిని పాటించలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెన్నిస్లో అండర్ఆర్మ్ షాట్ ఆడటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఆటగాళ్లు. కానీ నిక్ అదేమి పట్టించుకోకుండా విమర్శల పాలయ్యాడు.
అండర్ ఆర్మ్ షాట్ అంటే ఏంటీ?
సాధారణంగా టెన్నిస్లో బంతిని పైనుంచి కొట్టాలి. కానీ.. కింద నుంచి ఆడడమే అండర్ ఆర్మ్ షాట్. ఇది ఆట నిబంధనలకు వ్యతిరేకం కానప్పటికీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్రికెట్లోనూ అండర్ ఆర్మ్ అంశం వివాదాస్పమైంది. 1981 ఆస్టేలియా- న్యూజిలాండ్ మ్యాచ్లో కంగారూ ఆటగాడు ట్రెవెర్ చాపెల్ అండర్ ఆర్మ్ బంతిని వేసి వివాదాస్పదమయ్యాడు. ఒకప్పుడు ఇది క్రికెట్ నిబంధనలలో ఉంది. అనంతరం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ నిబంధనను తొలగించారు. భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సోదరుడే ఈ ట్రెవెర్ చాపెల్. అప్పడు ఆస్ట్రేలియా సారథిగా ఉన్న గ్రెగ్ .. అండర్ ఆర్మ్ బంతిని వేయడానికి సోదరుడిని ఉసిగొలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">