ETV Bharat / sports

25 ఏళ్ల కెరీర్​కు బ్రయాన్ సోదరులు వీడ్కోలు - Bryan brothers latest news

టెన్నిస్​లో జోడీగా ఎన్నో ఘనతల్ని సాధించిన బ్రయాన్ సోదరులు.. తమ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించారు. లెక్కలేనన్ని టైటిల్స్ సాధించి, ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించారు.

25 ఏళ్ల కెరీర్​కు బ్రయాన్ సోదరులు వీడ్కోలు
బ్రయాన్ సోదరులు
author img

By

Published : Aug 28, 2020, 5:51 AM IST

అమెరికన్ టెన్నిస్ డబుల్స్ కవలల జోడీ బాబ్- మైక్ బ్రయాన్.. 25 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్​కు ముగింపు పలికారు. అది కూడా యూఎస్ ఓపెన్​ ప్రారంభానికి మూడు రోజుల ముందే. 1995లో ఇదే గ్రాండ్​స్లామ్ టోర్నీతో టెన్నిస్​లోకి ఎంట్రీ ఇచ్చారు.

Twins Bob, Mike Bryan
మైక్-బాబ్ బ్రయాన్

42 ఏళ్ల ఈ కవల సోదరులు.. మొత్తంగా 16 సార్లు గ్లాండ్​స్లామ్ ఛాంపియన్స్​గా నిలిచారు. 119 టూర్ లెవల్ టైటిల్స్ గెలుపొందారు. 2012 ఒలింపిక్స్​లో స్వర్ణం సొంతం చేసుకున్నారు. ఏటీపీ డబుల్స్​ ర్యాంకింగ్స్​లో 10 సీజన్లలో నంబర్.1గా నిలిచి రికార్డు సృష్టించారు. 2007లో డేవిస్ కప్​ను అమెరికా గెల్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

"మేం వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాం" అని మైక్ చెప్పాడు. "టెన్నిస్​లో ప్రతిరోజూ పూర్తిస్థాయిలో కష్టపడ్డామని, అందుకు గర్వంగా ఉంది. అయితే అభిమానుల కేరింతలు, అరుపుల్ని చాలా మిస్సవనున్నాం" అని బాబ్ అన్నాడు.

డేవిస్ కప్ చరిత్రలోనే బ్రయాన్ సోదరులు.. అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచాడు. 15 ఏళ్లలో 25 మ్యాచ్​ల్లో విజేతగా నిలిచారు.

mike-bob bryan
మైక్-బాబ్ బ్రయాన్

2018లో పెట్టిన ఏటీపీ నిబంధనల ప్రకారం టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్​లో చోటు దక్కించుకున్న తొలి కవలలుగా నిలిచారు బ్రయాన్ సోదరులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.