ఫ్రెంచ్ ఓపెన్ వరుసగా రెండో ఏడాది వాయిదా పడే అవకాశముంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లో మరోసారి లాక్డౌన్ విధించారు. శనివారం మొదలైన లాక్డౌన్ మే రెండో వారం వరకు కొనసాగొచ్చు.
దీంతో ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా వేయడంపై ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్యతో మాట్లాడుతున్నామని ఆ దేశ క్రీడల మంత్రి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మే 23న ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆరంభం కావాల్సి ఉంది. నిరుడు కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నాలుగు నెలలు ఆలస్యమైంది.
ఇదీ చదవండి: 'ఎలా ఆడాలో.. కోహ్లి, రోహిత్‌ల నుంచి నేర్చుకుంటా'