ప్రపంచ టెన్నిస్ దిగ్గజాలలో ఒకరైన నొవాక్ జకోవిచ్.. ఇటీవల యూఏస్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. లైన్ అంపైర్‌ను అనుకోకుండా బంతితో కొట్టడం వల్ల ఈ వేటు పడింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకపోవచ్చు. ఎందుకంటే టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇక లైన్ అంపైర్లే కనపడకపోవచ్చు.
యూఎస్ ఓపెన్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన 'ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్' విధానం విజయవంతం కావడమే దానికి కారణం.
"ఎలక్ట్రానిక్ లైనింగ్ విధానం విజయవంతమైంది. అందులో ఎలాంటి చర్చలకు తావులేదు. దాని పనితీరు పట్ల సంతోషంగా ఉన్నాం. వచ్చే ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పూర్తిస్థాయిలో హాక్-ఐ విధానాన్ని ప్రవేశపెట్టాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు".
--స్టెసీ అలెస్టర్, యూఎస్ ఓపెన్ టోర్నీ డైరెక్టర్
కరోనా కాలంలో ఈ టోర్నీ విజయవంతంగా ముగియడంపై స్పందిస్తూ.. "చాలా సురక్షితంగా టోర్నీ సాగింది. ఆటగాళ్లతో పాటు టెన్నిస్‌కూ ఇది ఆర్థికంగా మేలు చేసింది" అని యూఎస్ టెన్నిస్ సంఘం సీఈఓ మైక్ డౌస్ పేర్కొన్నారు.