ETV Bharat / sports

'క్వారంటైన్​ ఆటగాళ్ల ఖర్చు మేమే భరిస్తాం' - tennis australia quarantine players

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొననున్న ఆటగాళ్ల క్వారంటైన్​ ఖర్చునంతా తామే భరిస్తామని తెలిపారు టోర్నీ డైరెక్టర్​ క్రెయిగ్​ టైలీ. ఈ టోర్నీలో ఇప్పటికీ పది కరోనా పాజిటివ్​ కేసులు నమోదు అవ్వగా.. 72మంది ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉన్నారు.

aus
ఆస్ట్రేలియన్​
author img

By

Published : Jan 21, 2021, 6:58 AM IST

Updated : Jan 21, 2021, 7:04 AM IST

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ నిర్వ‌హించ‌డానికి టెన్నిస్ ఆస్ట్రేలియా భారీగానే ఖ‌ర్చు చేస్తోంది. కరోనా కారణంగా.. ఈసారి ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచడం, వారికి ఏమీ కాకుండా ప్రత్యేకంగా అనేక జాగ్రత్తల చర్యలు తీసుకోవడమే అధికంగా ఖర్చు అవ్వడానికి కారణం. అయితే దీని కోసం 4 కోట్ల డాల‌ర్లు ఖర్చవుతుందని.. ఆ మొత్తం తామే భరిస్తామని చెప్పారు టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ క్రెయిగ్​ టైలీ. గ‌తంలో ఈ మొత్తాన్ని విక్టోరియా ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. తాజాగా దీనికి సంబంధించి స్పష్ట‌త ఇచ్చారు.

అంతకముందు.. విదేశాల నుంచి వ‌చ్చిన ఆటగాళ్ల క్వారంటైన్ ఖ‌ర్చును ప్ర‌భుత్వం భ‌రిస్తే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని విక్టోరియా రాష్ట్ర మంత్రి లీసా నెవిల్ అన్నారు. దీంతో ఆ మొత్తాన్ని తామే భరిస్తామ‌ని టెన్నిస్ ఆస్ట్రేలియా తెలిపింది.

కరోనా సెగ

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ఇప్పటికీ పది కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వడం వల్ల 72 మంది ఆటగాళ్లు కఠిన క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. వీరందరూ తమ గదులను దాటి బయటకు వచ్చి ప్రాక్టీస్​ చేయడానికి అనుమతి లేదు.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​: 'సెట్ల ఫార్మాట్​ను మార్చే ప్రసక్తే లేదు'

Last Updated : Jan 21, 2021, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.