ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్​: నాదల్​ ఇంటికి.. జకోవిక్​ ఫైనల్​కు

దాదాపు ఏడు నెలల తర్వాత టెన్నిస్​ రాకెట్​ పట్టిన రఫెల్​ నాదల్​ ఇటాలియన్​ ఓపెన్​ నుంచి అనూహ్యంగా నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్​ క్వార్టర్స్​లో స్క్వాట్జ్​మ్యాన్​ చేతిలో ఓడిపోయాడు. సెర్బియా స్టార్​ జకోవిక్ ఫైనల్​కు చేరాడు.

'Strange not facing Nadal,' says Djokovic ahead of 10th Italian Open final
ఇటాలియన్​ ఓపెన్​: నాదల్​ ఇంటికి.. జకోవిచ్​ ఫైనల్​కు
author img

By

Published : Sep 21, 2020, 8:03 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ముంగిట రఫెల్‌ నాదల్‌కు చుక్కెదురైంది. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి బరిలో దిగిన ఈ స్పెయిన్‌ స్టార్‌.. ఇటాలియన్‌ ఓపెన్లో అనూహ్యంగా ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌ఫైనల్లో నాదల్‌ 2-6, 5-7తో డిగో స్క్వాట్జ్‌మ్యాన్‌ చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూశాడు. తొమ్మిదిసార్లు ఇటాలియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అయిన రఫా.. డిగోతో తలపడ్డ గత తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు. సర్వీసుల్లో బలహీనంగా కనిపించిన నాదల్‌.. అనవసర తప్పిదాలతో ఓటమి కొని తెచ్చుకున్నాడు.

"ఈ ఏడాది ఊహకందనిదిగా ఉంది. లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలలు రాకెట్‌ను ముట్టుకోలేదు. ఈ టోర్నీలో కనీసం మూడు మ్యాచ్‌లైనా గెలవగలిగాను" అని పరాజయం అనంతరం రఫా అన్నాడు.

ఫైనల్​కు జకోవిక్​

ఇటాలియన్‌ ఓపెన్​లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో జకో 7-5, 6-3తో రూడ్‌ (నార్వే)ను ఓడించాడు.

ఫైనల్​లో హలెప్​, ప్లిస్కోవా

మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్‌ (రొమేనియా), ప్లిస్కోవా (చెక్‌) ఫైనల్‌ చేరారు. సెమీఫైనల్లో ఈ టాప్‌సీడ్‌ 6-3, 4-6, 6-4తో ముగురుజ (స్పెయిన్‌)ను ఓడించింది. సెమీస్‌లో ప్లిస్కోవా 6-2, 6-4తో తన దేశానికే చెందిన వోండ్రుసోవాను ఓడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.