ఆటలో నియంత్రణ కోల్పోవడం ఆటగాళ్లకు సహజమే.. ఇలాంటి సమయంలో ఓర్పుగా ఉండాలి.. కానీ ఆ కోపాన్ని ప్రత్యర్థులపైనో.. వేరే ఇంకెవరిపైనో చూపిస్తుంటారు చాలా మంది ప్లేయర్లు. తాజాగా గ్రీస్ టెన్నిస్ స్టార్ స్టెఫానో సిట్సిపాస్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ఆవేశంతో రాకెట్‌ను నేలకేసి బాదుతూ.. సొంత తండ్రినే కొట్టేశాడు.
ఈ ఘటన ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో జరుగుతున్న ఏటీపీ కప్‌లో చోటు చేసుకుంది. ఆసీస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్‌తో జరిగిన మ్యాచ్‌లో సిట్సిపాస్ తొలి సెట్ కోల్పోయాడు. అనంతరం కోపాన్ని ఆపుకోలేని గ్రీస్ స్టార్ టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి బాదడం మొదలుపెట్టాడు. పక్కనే కూర్చున్న తన తండ్రి అపోస్టోలోస్ సిట్సిపాస్‌కు ఆ రాకెట్ తగిలింది. కుమారుడి ప్రవర్తన పట్ల అసంతృప్తి చెందిన అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ప్రేక్షకుల మధ్యలో ఉన్న అతడి తల్లి.. సిట్సిపాస్ దగ్గరకు వచ్చి కొడుకు తలంటింది.
"ఈ ఘటన అనుకోకుండా జరిగింది. మా నాన్నను బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. దురదృష్టవశాత్తు నన్ను నేను నియంత్రించుకోలేకపోయా" -స్టెఫానో సిట్సిపాస్, గ్రీస్ టెన్నిస్ స్టార్.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సిట్సిపాస్ ప్రవర్తనను పలువురు విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్‌పై నిక్ కిర్గియోస్ 7-6(9-7), 6-7(3-7), 7-6(7-5) తేడాతో విజయం సాధించాడు.
ఇదీ చదవండి: అవసరాన్ని బట్టి 3, 4 స్థానాల్లో వస్తా: కోహ్లీ