ETV Bharat / sports

Tokyo Olympics: సింధుకు స్వర్ణం సాధించే సత్తా ఉంది - gopichand olympics

గతం​తో పోల్చితే ఒలింపిక్స్​లో ఈసారి భారత్​ రెట్టింపు సంఖ్యలో పతకాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బ్యాడ్మింటన్ కోచ్​ పుల్లెల గోపీచంద్. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు కచ్చితంగా మెడల్​ గెలుచుకుంటుందని పేర్కొన్నారు. షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్​ లిఫ్టింగ్​.. ఇలా ప్రతి విభాగంలో పతకం గెలవడానికి అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.

Pullela Gopichand, PV Sindhu
పుల్లెల గోపీచంద్, పీవీ సింధు
author img

By

Published : Jul 21, 2021, 5:11 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో గతం కంటే మెరుగ్గా భారత్ రెట్టింపు పతకాలను సాధిస్తుందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు మెడల్ గెలుచుకుంటుందని.. ఈసారి క్రీడాకారులంతా తమదైన ప్రదర్శనతో భారత్ పేరును నిలబెడతారని గోపీచంద్ ధీమాగా చెప్పారు. ఈసారి అత్యధిక సంఖ్యలో భారత్​ నుంచి 127 మంది అథ్లెట్లను టోక్యోకు పంపించామన్నారు.

"లండన్​ ఒలింపిక్స్​లో భారత్​ ఆరు పతకాలు గెలుచుకుంది. ఈసారి ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు మద్దతు బాగా ఉంది. షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్​లిఫ్టింగ్​.. ఇలా ఏ రంగంలో చూసిన పతక అవకాశాలు మెండుగా ఉన్నాయి" అని గోపీచంద్ తెలిపారు.

"బ్యాడ్మింటన్​లో రియో, లండన్​ ఒలింపిక్స్​లో సాధించిన దానికంటే ఈ సారి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింధు కచ్చితంగా పతకం సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఈసారి స్వర్ణం సాధించేవారి జాబితాలో ఆమె ముందుంటుంది. డబుల్స్​లో చిరాగ్-సాత్విక్​ జోడీ కూడా పతకం సాధించే వారిలో ఒకరు. సాయి ప్రణీత్​ గత ప్రపంచ ఛాంపియన్​షిప్​లో అంచనాలను అందుకున్నాడు. గత ఫామ్​ను ప్రస్తుతం కూడా కొనసాగిస్తాడని ఆశిస్తున్నా."

-గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్.

క్రీడాకారుల కోసం ధ్యాన యాప్

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే భారత క్రీడాకారులు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మెడిటేషన్ భాగస్వామిగా ఉన్న ధ్యాన యాప్.. యోగా శిక్షణ ఇచ్చే హార్ట్ ఫుల్ నెస్ సంస్థతో కలిసి పనిచేయనుంది. వర్చువల్ జూమ్ ద్వారా జరిగిన కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ స్థాపకులు దాజీ కమలేష్ పటేల్ సందేశం ఇవ్వగా.. పుల్లెల గోపీచంద్, హార్ట్ ఫుల్ నెస్ శిక్షణ తీసుకుంటున్న స్క్వాష్ క్రీడాకారిణి తన్వి ఖన్నా, నటి తన్యా సహా పలువురు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వేళ ఆసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడాకారులకు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని.. వారిని ఎప్పటికప్పుడు యోగా, ధ్యాన శిక్షణతో ఉత్తేజపరిచేందుకు ధ్యాన యాప్ ఎంతో ఉపయోగపడుతుందని గోపీచంద్ అన్నారు.

యోగా, ధ్యానంతో క్రీడాకారుల ఏకాగ్రత పెరుగుతుందని.. ఒత్తిడిని ఎదుర్కొని దీటుగా నిలబడేలా చేసే శక్తి ధ్యానానికి ఉందని ఆధ్యాత్మిక గురువు, హార్ట్ ఫుల్ నెస్ సంస్థ స్థాపకులు కమలేష్ పటేల్ స్పష్టం చేశారు. కోచ్ పుల్లెల గోపీ చంద్, స్క్వాష్ క్రీడాకారిణి తన్వి ధ్యానంతో పొందిన ప్రయోజనాలు వివరించారు. మెడిటేషన్ తీవ్రతను తెలియజేస్తూ టోక్యోలో భారత బృందానికి ధ్యాన యాప్ మరింత మానసిక శక్తిని ఇస్తుందని గోపీచంద్ తెలిపారు.

ఇదీ చదవండి: ఒలింపిక్స్: ఈసారి వాటికి దూరం- అతిథులూ తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.