ETV Bharat / sports

ఒలింపిక్స్​కు సిమోనా హలెప్​ దూరం- కారణమిదే.. - గాయం కారణంగా హలెప్​ ఒలింపిక్స్​కు దూరం

కాలిపిక్క గాయంతో బాధపడుతున్న రొమేనియా స్టార్ టెన్నిస్ ప్లేయర్​ సిమోనా హలెప్.. రానున్న టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సెరెనా విలియమ్స్​, రఫెల్ నాదల్, డొమినిక్ థీమ్.. ఈ మెగా ఈవెంట్​ నుంచి వైదొలిగారు.

halep, tokyo olympics
హలెప్, టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : Jun 29, 2021, 3:25 PM IST

Updated : Jun 29, 2021, 3:51 PM IST

రొమేనియా స్టార్ టెన్నిస్ ప్లేయర్​ సిమోనా హలెప్ టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. రోమ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీలో రెండో రౌండ్​ మ్యాచ్​ సందర్భంగా గాయపడింది హలెప్​. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్​తో పాటు వింబుల్డన్​కు దూరమైంది.

"రొమేనియాకు ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. కానీ, కాలిపిక్క గాయం నుంచి నేనింకా కోలుకోలేదు. దానికింకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే రానున్న టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్​తో పాటు వింబుల్డన్​కు దూరమయ్యాను."

-సిమోనా హలెప్, టెన్నిస్ క్రీడాకారిణి.

"ఒలింపిక్స్​ నుంచి తప్పుకుంటున్నాననే ఆలోచనే జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ, అంతే బలంగా తిరిగి గాయం నుంచి కోలుకుంటాను. రొమేనియా అథ్లెట్లను చూస్తూ సంతోషంగా గడుపుతాను" అని హలెప్​ ట్విట్టర్​లో పేర్కొంది.​

హలెప్​తో పాటు యూఎస్​ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్​, ప్రపంచ మూడో సీడ్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్, గతేడాది యూఎస్ ఓపెన్ విజేత డొమినిక్ థీమ్​.. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రతిష్టాత్మక ఆటలు టోక్యో వేదికగా జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. 2020లో జరగాల్సిన ఈ ఒలింపిక్స్​ కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.

ఇదీ చదవండి: Wimbledon: వింబుల్డన్​కు ఎంపికైన తొలి చైనా ఆటగాడు

Last Updated : Jun 29, 2021, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.