అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. యూఎస్ ఓపెన్‌లో అత్యధిక సింగిల్స్ గెలుపొందిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో అమెరికాకు చెందిన క్రిస్ ఈవర్ట్పై వరుస సెట్లలో గెలుపొంది ఈ ఘనత సాధించింది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పోరాడుతున్న సెరెనా 7-5, 6-3 తేడాతో క్రిస్‌ను మట్టికరిపించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తన తదుపరి మ్యాచ్‌ను రష్యాకు చెందిన మార్గరీటా గాస్పరియన్‌తో సెప్టెంబరు 3న తలపడనుంది.
మరోవైపు సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ 6-3,7-5 తేడాతో 20వ ర్యాంకర్ కరోలినా ముచోవా చేతిలో ఓటమి పాలైంది. ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే వీనస్ ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి.
ఇది చూడండి 'ఆ క్రెడిట్ అంతా కెప్టెన్ మోర్గాన్‌దే'