ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు సెరెనా దూరం - సెరెనా విలియమ్స్

serena williams australian open: ఏడు సార్లు ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టైటిల్​ కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నెం.1 సెరెనా విలియమ్స్​.. వచ్చే ఏడాది జరగనున్న టోర్నీకి దూరం కానుంది. గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న సెరెనా.. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

serena williams
సెరెనా విలియమ్స్
author img

By

Published : Dec 8, 2021, 5:32 PM IST

serena williams australian open: ప్రపంచ మాజీ నెం.1 సెరెనా విలియమ్స్​.. 2022 ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు దూరం కానుంది. తన వైద్య బృందం సలహా మేరకు బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది సెరెనా. దీంతో వచ్చే నెల నుంచి జరగనున్న టోర్నీ కోసం ఎంట్రీ లిస్ట్​లో ఆమె పేరును చేర్చలేదు. జనవరి 17 నుంచి ఈ టోర్నమెంట్​ ఆరంభం కానుంది.

గాయం కారణంగా ఈ ఏడాది జూన్​లో జరిగిన వింబుల్డన్​ తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది సెరెనా. అప్పటి నుంచి కోర్టులో అడుగుపెట్టలేదు. ఇప్పటి వరకు 23 గ్రాండ్​స్లామ్​ సింగిల్స్​ టైటిల్స్​ సాధించిన సెరెనా.. తన చివరి గ్రాండ్​స్లామ్​ను 2017 ఆస్ట్రేలియన్​ ఓపెన్​లోనే కైవసం చేసుకుంది. 7 సార్లు ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఛాంపియన్​గా నిలిచిన ఆమె.. 2021 టోర్నీలో సెమీస్​ నుంచి నిష్ర్కమించింది.

2019లో యూఎస్​ ఓపెన్​ కైవసం చేసుకున్న బియాంక ఆండ్రెస్క్యూ కూడా ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొనడంలేదని సోమవారం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ATP Cup 2022: ఏటీపీ కప్​లో ఆడనున్న జకోవిచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.