ETV Bharat / sports

Tokyo Olympics: సెమీస్​లో ఓడిన జకోవిచ్ - Novak Djokovic tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్​ స్టార్ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్​కు చుక్కెదురైంది. ఎలాగైనా పతకం గెలవాలన్న ఆశతో బరిలో దిగిన ఈ సెర్బియా టెన్నిస్ ప్లేయర్ సెమీఫైనల్లోనే ఓటమి పాలయ్యాడు.

Novak Djokovic
జకోవిచ్
author img

By

Published : Jul 30, 2021, 3:44 PM IST

Updated : Jul 30, 2021, 3:58 PM IST

ఒలింపిక్స్​లో​ టెన్నిస్ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జర్మనీ ఆటగాడు జ్వెరెవ్​పై పరాజయం చెందాడు. 1-6, 6-3, 6-1 తేడాతో ఓడిపోయాడు జకో. దీంతో ఇతడి స్వర్ణ పతక ఆశలు ఆవిరయ్యాయి.

ఇటీవలే తన ఆరో వింబుల్డన్ టైటిల్ గెలిచిన జకో.. కెరీర్​లో 20 గ్లాండ్​స్లామ్​లతో స్విస్ దిగ్గజం ఫెదరర్, నాదల్​ సరసన చేరాడు. ఈ సీజన్​లో ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ దక్కించుకున్న సెర్బియన్ స్టార్.. ఒలింపిక్స్​లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగాడు. కానీ అతడికి నిరాశే ఎదురైంది.

Last Updated : Jul 30, 2021, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.