ETV Bharat / sports

Ostrava Open 2021: ఒస్త్రావా ఓపెన్​ విజేతగా సానియా జోడీ - sania ostrava doubles partners

ఒస్త్రావా ఓపెన్​(Ostrava Open 2021) మహిళల డబుల్స్​లో భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా జోడీ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో క్రిస్టియన్​(అమెరికా)-రౌట్లిఫ్​(న్యూజిలాండ్​) జంటపై సానియా జోడీ(Sania Mirza Ostrava Open) విజయం సాధించింది.

Sania Mirza wins first title of 2021 season in Ostrava
Ostrava Open 2021: ఒస్త్రావా ఓపెన్​ విజేతగా సానియా జోడీ
author img

By

Published : Sep 27, 2021, 9:05 AM IST

సానియా మీర్జా(Sania Mirza Ostrava Open) ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ సాధించింది. షుయ్‌ జాంగ్‌(చైనా)తో జత కట్టిన ఆమె.. ఒస్త్రావా ఓపెన్‌(Ostrava Open 2021) మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్లో సానియా-జాంగ్‌ జంట 6-3, 6-2తో క్రిస్టియన్‌ (అమెరికా), రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జోడీపై విజయం సాధించింది.

అంతకుముందు సెమీస్​లో సానియా, జాంగ్​ 6-2, 7-5తో హొజుమి, నినోమియా(జపాన్​)లపై సానియా జోడీ విజయం సాధించింది. 2021 సీజన్లో సానియాకిది రెండో ఫైనల్​. గత నెలలో అమెరికాలో జరిగిన క్వీవ్​లాండ్​ ఈవెంట్లో కిర్​స్టినాతో కలిసి ఆడిన సానియా.. రన్నరప్​గా నిలిచింది.

ఇదీ చూడండి.. IPL 2021: హ్యాట్రిక్​తో ముంబయికి చుక్కలు చూపించిన హర్షల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.