నాలుగేళ్ల విరామం తర్వాత భారత ఫెడ్ కప్ జట్టులోకి అడుగుపెట్టనుంది స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. ఐదుగురు సభ్యుల జట్టులో సానియాను కూడా ఎంపిక చేసింది అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్.

సానియాతో పాటు అంకితా రైనా, రియా భాటియా, రుతుజా భోంస్లే, కర్మన్ కౌర్ థాండి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రిజర్వ్ ప్లేయర్‌గా సౌజన్య భావిసెట్టిని ఎంపిక చేశారు. ఈ జట్టుకు విశాల్ ఉప్పల్ సారథ్యం వహించనుండగా.. అంకిత బాంబ్రీ కోచ్‌గా వ్యవహరిస్తారు.
సానియా చివరగా 2016 ఫెడ్‌కప్ జట్టులో ఆడింది. 2017 అక్టోబరులో వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకుంది. చైనా వేదికగా ఫిబ్రవరి 3వ వారం నుంచి ఫెడ్ కప్ ఆసియా గ్రూప్-1 ఈవెంట్ టోర్నీ జరగనుంది.
ఇదీ చదవండి: పీసీబీ ఛైర్మెన్‌కు అలా మాట్లాడే హక్కే లేదు: అరుణ్