ETV Bharat / sports

ఖాళీ స్డేడియంలో ఫ్రెంచ్​ ఓపెన్​ టోర్నీ!

author img

By

Published : May 10, 2020, 4:50 PM IST

ఫ్రెంచ్​ ఓపెన్​ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భావిస్తోంది ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య. సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 4 తేదీల మధ్య మ్యాచ్​లు జరగనున్నాయి.

French open tournament
ఖాళీ స్డేడియంలో ఫ్రెంచ్​ ఓపెన్​ టోర్నీ

ఈ ఏడాది ఫ్రెంచ్​ ఓపెన్​ ఖాళీ స్టేడియంలో జరగొచ్చని ఫ్రెంచ్​ టెన్నిస్​ చీఫ్​ బెర్నార్డ్​ గ్యుడిసెల్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. షెడ్యూల్​ ప్రకారం మే 24 నుంచి జూన్​7 మధ్య జరగాల్సిన టోర్నీ.. కరోనా ప్రభావంతో సెప్టెంబరు20 -అక్టోబర్​ 4 వరకు జరపాలనుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయంపై ఎలాంటి మార్పు లేదని బెర్నార్డ్ స్పష్టం చేశారు.

"ఖాళీ స్డేడియంలో నిర్వహించడం తప్ప మాకు మరో అవకాశం లేదు. ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీని కోసం వేచిచూస్తున్నారు. వారు లేకుండా నిర్వహించడం వ్యాపార నమూనాలో ఓ భాగమే. ప్రసారహక్కుల ద్వారా ఆదాయం వస్తుంది."

-బెర్నార్డ్​ గ్యుడిసెల్లీ, ఫ్రెంచ్​ టెన్నిస్​ చీఫ్.

ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా పడటం వల్ల, టికెట్​ డబ్బులు రీఫండ్​ చేయనున్నట్లు తెలిపింది ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య. దీనితో పాటే ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ రద్దయింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్​ 13వ తేదీల మధ్య జరగాల్సిన యూఎస్ ఓపెన్ నిర్వహణ సందిగ్ధంలో పడింది.

ఇదీ చూడండి : డబ్బులు తిరిగిచ్చేందుకు టోర్నీ నిర్వహకులు సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.