ETV Bharat / sports

రోజర్స్​ కప్​ బియాంకాదే.. ఫైనల్లో సెరెనాపై విజయం

ఆదివారం టొరంటోలో జరిగిన రోజర్స్ కప్​ ఫైనల్​లో టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్​(అమెరికా) ను ఓడించి కెనడా టీనేజర్ బియాంకా టైటిల్ కైవసం చేసుకుంది. 50 ఏళ్ల అనంతరం ఈ టైటిల్​ అందుకున్న మొట్టమొదటి కెనడియన్​ గా చరిత్ర సృష్టించింది బియాంకా.

సెరెనాపై బియాంకా విజయం
author img

By

Published : Aug 12, 2019, 10:08 AM IST

Updated : Sep 26, 2019, 5:42 PM IST

రోజర్స్​కప్​ ఫైనల్​లో కెనడా యువ క్రీడాకారిణి బియాంకా ఆండ్రెస్కు సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్(అమెరికా)​ను ఓడించి రోజర్స్​ కప్​ టైటిల్​ను గెలుచుకుంది.

రోజర్స్​ కప్​ ఫైనల్

వెన్నునొప్పితో వెనుదిరిగిన సెరెనా...

మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్​షిప్​ విజేతగా నిలిచిన సెరెనాపై 3-1 తేడాతో విజయం అందుకుందీ 19 ఏళ్ల అమ్మాయి. తొలి సెట్లో 3-1 తేడాతో వెనుకంజలో ఉన్న సెరెనా నడుంనొప్పితో మ్యాచ్​ ఆడలేకపోయింది. అనంతరం రిఫరీ.. బియాంకాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ కొనసాగించలేకపోయిందుకు సెరెనా కంటతడి పెట్టుకుంది. బియాంకా.. సెరెనాను కౌగిలించుకుని ఓదార్చింది.

"ఈ నొప్పి నిన్ననే(శనివారం) మొదలైంది. అయినా ఆడాలనుకున్నా.. ఈ రోజుకు నొప్పి తీవ్రమైంది. కనీసం కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాను. ఆట కొనసాగించలేనని అనుకున్నా"

-సెరెనా విలియమ్స్​, టెన్నిస్ దిగ్గజం

ఈ ఏడాది రెండో టైటిల్ అందుకుంది బియాంకా. మార్చిలో ఇండియన్ వెల్స్​లో​ సత్తాచాటిన కెనడియన్ తొలి డబ్ల్యూటీఏ టైటిల్​ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత భుజం గాయంతో కొన్ని రోజులు ఆటకు దూరమై.. రోజర్స్​ కప్​ కోసం మళ్లీ రాకెట్ పట్టింది.

ఇదీ చూడండి: '300 వన్డేలు.. మా ఊహకు అందనిది'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 26, 2019, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.