ETV Bharat / sports

13 ఏళ్ల కల.. సాకారం చేసుకునే దిశలో నాదల్​! - రఫెల్​ నాదల్ తాజా సమాచారం

రఫెల్​ నాదల్​ తన కెరీర్​లో అందని కొమ్మగా నిలిచిపోయిన పారిస్​ మాస్టర్స్ టైటిల్​ కోసం.. అడుగులు వేస్తున్నాడు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్​లో నెగ్గిన అతను క్వార్టర్స్​లోకి దూసుకెళ్లాడు.

rafel nadal entered into quarter finals of paris masters tournament
13 ఏళ్ల కల.. సాకారం చేసుకునే దిశలో నాదల్​!
author img

By

Published : Nov 7, 2020, 9:00 AM IST

స్పెయిన్​ స్టార్​ రఫెల్​ నాదల్​ పారిస్​ మాస్టర్స్​ టోర్నీలో తొలి టైటిల్​ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతను పెద్దగా కష్టపడకుండానే క్వార్టర్​ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్​లో 6-1, 7-6, (7-3)తేడాతో జోర్డాన్​ థాంప్సన్​ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. తొలి సెట్​ను అలవోకగా గెలిచిన నాదల్​కు.. రెండో సెట్లో థాంప్సన్​ నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే టైబ్రేకర్​లో సెట్​ నెగ్గి రఫా.. ముందంజ వేశాడు.

ఈ స్పెయిన్​ బుల్​ కెరీర్​లో 86 ఏటీపీ టైటిళ్లు సాధించగా.. అందులో 35 మాస్టర్స్​ ట్రోఫీలు ఉన్నాయి. కానీ, ఇప్పటిదాకా పారిస్​ మాస్టర్స్​ మాత్రం అతని సొంతం కాలేదు. చివరిగా ఒకే ఒక్కసారి ఈ టోర్నీలో 13 ఏళ్ల క్రితం ఫైనల్​కు రాగా.. రన్నరప్​ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.

ఇదీ చూడండి:టెన్నిస్ సింగిల్స్​లో నాదల్ 1000 విజయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.