భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. ఏడాది తర్వాత బరిలోకి దిగిన సానియా.. ఖతార్ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సానియా, ఆండ్రెజా క్లెపాక్ (స్లొవేనియా) జోడీ 6-4, 6-7(5), 10-5తో ఉక్రెయిన్ ద్వయం నడియా కిచెనోక్, ల్యుద్మైలా కిచెనోక్పై విజయం సాధించింది.
తొలి సెట్ నాలుగో గేమ్‌లో 0-3తో వెనుకబడ్డ సానియా, క్లెపాక్ జంట ఆ తర్వాత పుంజుకుంది. పదునైన సర్వ్‌లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతూ పోటీలోకి వచ్చి మొదటి సెట్‌ను దక్కించుకుంది. మళ్లీ కిచెనోక్ సిస్టర్స్ ప్రతిఘటించగా.. మ్యాచ్ రసవత్తరంగా మారింది. టైబ్రేకర్‌కు దారి తీసిన రెండో సెట్‌ను గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది సానియా జోడీ.
ఏడాది తర్వాత..
గతేడాది హోబర్ట్ ఓపెన్ గెలిచిన ఈ హైదరాబాదీకి ఏడాది తర్వాత ఇదే తొలి టోర్నీ కావడం విశేషం. ఈ జనవరిలో కరోనా బారిన పడిన సానియా.. ఆ తర్వాత కోలుకుంది. అనంతరం.. ఇప్పుడు కోర్టులో మెరుపులు మెరిపించింది. ఇటీవలే కరోనా వైరస్ నుంచి కోలుకున్న సానియా.. మళ్లీ కోర్టులో మెరుపులు మెరిపించింది.
ఇదీ చూడండి: 'పిచ్ ఏమో కానీ.. వై-ఫై మాత్రం సరిగా లేదు'