ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయర్స్ పురుషుల సింగిల్స్‌లో భారత్ కథ ముగిసింది. బరిలో మిగిలిన ప్రజ్ఞేశ్ గణేశ్వరన్ బుధవారం రెండో అర్హత రౌండ్లో 4-6, 6-7 (4-7) తేడాతో అలెగ్జాండర్ ఉకిచ్ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఇప్పటికే సుమిత్ నగాల్, రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా గురువారం రెండో రౌండ్ అర్హత మ్యాచ్‌లో కురుమి (జపాన్)తో తలపడనుంది.