భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్.. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకోసం బాగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కోల్‌కతాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పేస్.. ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఒలింపిక్స్.. వచ్చే సంవత్సరం టోక్యోలో నిర్వహించనున్నారు.
"కరోనా లాంటి ఉపద్రవం వస్తుందని మనం ఎవరూ అనుకోలేదు. అది మనల్ని పూర్తిగా మార్చేసింది. అయితే చాలారోజుల విరామం తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను. మానసికంగా, శారీరకంగా పూర్తి ఫిట్‌గా ఉన్నాను. మనదేశం పేరును చరిత్రలో నిలపాలని అనుకుంటున్నాను. అందులో భాగంగానే నా కెరీర్‌ను 30 ఏళ్ల పాటు కొనసాగించాను" -లియాండర్ పేస్, టెన్నిస్ క్రీడాకారుడు
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యే నాటికి పేస్ 48వ వసంతంలోకి అడుగుపెడతారు. అయితే వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే ఆయన చెబుతున్నారు. అందుకే ఒలింపిక్స్‌లో ఆడలని అనుకుంటున్నట్లు తెలిపారు.
1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించారు పేస్. ఇప్పుడు మరో మెడల్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నానని అన్నారు. ఇప్పటికే 18 టైటిళ్లు గెలుచుకున్న ఈయన.. 100 గ్లాండ్స్లామ్స్లో ఆడిన ఘనత దక్కించుకోవాలని అనుకుంటున్నారు.